ప్రస్తుత రోజుల్లో సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంత రావు మాట్లాడుతూ.. సమాజంలో భర్తలను భార్య.. తల్లినీ.. బిడ్డ చంపడం చూస్తుంటే బాధ ఐతుందన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగేవి. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయని తెలిపారు. అబ్బాయి, కానీ అమ్మాయి కానీ మీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకండి.. మీకు నచ్చిన వారినే చేసుకోండని సూచించారు. సమాజం ఎక్కడికి పోతుంది..? యమధర్మ రాజుతో కూడా భర్త…
V. Hanumantha Rao: కుల గణనపై ఎవరు మాట్లాడనప్పుడే రాహుల్ గాంధీ మాట్లాడారు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు పేర్కొన్నారు. ఎవరు ఎంతో, వారికి అంత అని చెప్పారు.. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మూడు సార్లు కలిసి బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వు అని కోరినా ఇవ్వలేదు.
పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
వి.హన్మంతరావు అలియాస్ వీహెచ్. కాంగ్రెస్‌లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయనంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడాయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్‌కు లాయల్‌గా ఉంటూ... అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది.
త్వరలోనే రాహుల్ గాంధీకి ధన్యవాద సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం ప్రకటించాడు.. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అప్పుడే వెల్లడించారు.. అందులో భాగంగానే.. దేశంలోనే మొట్ట మొదట తెలంగాణలో కులగణన చేశామని వి. హన్మంతరావు తెలిపారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలిశారు. జనగణన కుల ప్రాతిపదికన జరగాలని కోరారు. అలాగే డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ప్రధాని మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి.. కచ్చితంగా కుల ప్రాతిపదికన జనగణనపైన మోడీతో చర్చించాలని హనుమంతరావు కోరారు. తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో జనగణన ప్రారంభించారని గుర్తు చేశారు.
V.Hanumantha Rao : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న…
కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత వి. హనుమంతు రావు స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా జరిగాయన్నారు. "తెలంగాణలో విభజన హామీలు ఏవీ పూర్తి చేయలేదు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు కోరినా కేటాయింపులు జరపలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులిచ్చిన కేంద్రం, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు ఇవ్వలేదు. ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు కూడా…
V. Hanumantha Rao : బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వక్రికరించే పనిలో ఉందని, మోడీ సర్కార్ రిమోట్ కంట్రోల్ మోహన్ భగవత్ దగ్గర ఉందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య కట్టిన రోజే స్వాతంత్య్రం వచ్చింది అని అనడం సరికాదని, భగత్ సింగ్ లాంటి వాళ్ళ త్యాగాన్ని అవమానించినట్టు అని ఆయన మండిపడ్డారు. మోడీ.. సమాధానం చెప్పాలని, అమిత్ షా…అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు…