రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర జోరుగా కొనసాగుతోంది. తెలంగాణలో రాహుల్ యాత్ర చివరి దశకు చేరుకుంది. తెలంగాణలో ఇవాళ్టి తో ముగియనుంది రాహుల్ గాంధీ పాదయాత్ర. మేనూర్ లో కాంగ్రెస్ సభ లో రాహుల్ ప్రసంగించారు. మేనూరు లో కాంగ్రెస్ సభకు హాజరయ్యారు జైరాం రమేష్ , ఠాగూర్, జానారెడ్డి, సీతక్క, షబ్బీర్ అలీ , సుబ్బిరామి రెడ్డి, నాగం ..అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడీ నువ్వు ఢిల్లీలో హాయిగా ఉన్నావు… మా రాహుల్ గాంధీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు.. బీజేపీ దేవుళ్ళ పేరుతో రాజకీయం చేస్తోంది.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరం ఒకటే అనే భావన తో పని చేస్తోందన్నారు.
Read Also: Aruri Ramesh: మత్స్యకారుల ఆర్థిక పురోగతికి కృషి
ఎవరూ భయపడకండి. మునుగోడు ఎన్నికలను చూసి కన్ఫ్యూజ్ కావద్దు. వచ్చే ఎన్నికలకు మనం సిద్దం అవుదాం. టీఆర్ఎస్ వంద కోట్లు పెడితే మనం పెడదాం.. ఎన్నికల కమిషన్ అధికారులు చేతకానిదద్దమ్మలు. పోలీసులు కేసీఆర్ కి భయపడవద్దన్నారు. మేము అధికారం లోకి వస్తే పోలీసుల్ని బాగా చూసుకుంటాం, కేసీఆర్ కుటుంబం పోలీసులు లేకుండా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు జగ్గారెడ్డి. కలెక్టర్ లు, ఆర్డీవోలు చేతకాని వాళ్ళు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.
మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దేశ ప్రజలకు మేమున్నాం అని ధైర్యం చెప్పడానికి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. 2024 లో కేంద్రంలో అధికారం లోకి వచ్చేది కాంగ్రెస్సే. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వబోతోందన్నారు. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సాహసం చేస్తున్నారు. ఎవరైనా నడిచారా కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు. నెహ్రూ లాంటి వాళ్ళ చరిత్ర వక్రీకరించే పని చేస్తున్నారు మోడీ. రాహుల్ గాంధీ యమ స్పీడ్ గా నడుస్తున్నాడు. నేను అదృష్టవంతుణ్ణి .. అటు రాజీవ్ గాంధీతో సద్భావన యాత్రలో పాల్గొన్నా… ఇప్పుడు రాహల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నానన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఏమయ్యేది?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ పాలనలో పసుపు రైతులకు గిట్టుబాటు ధర లేదు. చక్కెర ఫ్యాక్టరీ లు తెరిపించాలి. రాహుల్ భారత్ జోడో యాత్ర సఫలీకృతం అయ్యింది. రాహుల్ నాయకత్వం కి కట్టుబడి ఉంటాం అన్నారు. ఎమ్మెల్యే సీతక్క రాహుల్ గాంధీ రాజకీయాల కోసం భారత్ జోడో యాత్ర చేయడం లేదన్నారు. అసమానతలు పెంచుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పాదయాత్ర సాగుతోందన్నారు. సభ అనంతరం కాగడాలతో పాదయాత్రగా వెళ్లి మహారాష్ట్ర పీసీసీకి ఫ్లాగ్ మార్చ్ అప్పగించనుంది తెలంగాణ పీసీసీ టీం. మహారాష్ట్ర బార్డర్ లోకి వెళ్లనుంది రాహుల్ పాదయాత్ర. 9.30 నుండి మహారాష్ట్రలో మరో ఆరు కిలోమీటర్ల పాదయాత్ర వుంటుంది.
ఊరూ వాడా!
చిన్న పెద్ద ప్రతి పౌరుని గోస వింటు
అనేక సమస్యల పరిష్కార పోరాటంగా సాగుతున్న భారత్ జోడో యాత్ర #BharatJodoYatra #ManaTelanganaManaRahul pic.twitter.com/W0JwVP4XO3— Ponnam Prabhakar (@PonnamLoksabha) November 7, 2022
Read Also: Kamal 234: 35 ఏళ్ల తరువాత ‘నాయకుడు’ కాంబో రిపీట్