రైలులోని టాయిలెట్‌లో చనిపోయిన ఓ వ్యక్తిని ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహంతోనే రైలు దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌లోని రోజా స్టేషన్‌లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అమృత్‌సర్ వెళ్తున్న సహర్స-అమృతసర్ జన్‌సేవా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది.
సిగరెట్ ఇద్దరి స్నేహితుల మధ్య నిప్పు పెట్టింది. ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉన్న ఆ స్నేహితులు ఓ చిన్న సిగరెట్ విషయంలో గొడవ పడ్డారు. అలా సిగరెట్ విషయంలో తలెత్తిన గొడవ.. ఏకంగా ఓ హత్యకు దారి తీసింది.
ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్‌దేవి ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ భగవంతుడి అవతారమని, ఆయన కోరుకున్నంత కాలం ఆయన పదవిలో కొనసాగవచ్చని ఉత్తరప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి బుధవారం అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించి మృతికి కారణమైన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో డెంగీతో చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీపోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ రాముడు తన విలువలు, పాలన ద్వారా "సబ్కా సాత్ సబ్కా వికాస్" ఆలోచనను ప్రేరేపించారని అన్నారు. దీపావళి ముందురోజు ప్రధాన మంత్రి అయోధ్యలో భగవాన్ శ్రీరాముని రాజ్యభిషేకాన్ని నిర్వహించారు. దేశ ప్రజలందరికీ అయోధ్య వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.