Bulldozer Threat: ఉత్తరప్రదేశ్‌లో రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించి మృతికి కారణమైన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రయాగ్‌రాజ్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో డెంగీ రోగికి బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో డెంగీతో చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రోగి ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కాకుండా.. అనధికారికంగా ఆసుపత్రిని నిర్మించారని విచారణలో తెలింది. దీంతో శుక్రవారం వరకూ ఖాళీ చేయాలని ప్రయాగ్‌రాజ్ పురపాలక సంఘం అధికారులు.. ఆసుపత్రికి కూల్చివేత నోటీసు జారీ చేశారు.
అనుమతి లేకుండా ఆసుపత్రిని నిర్మించారని, దానిని శుక్రవారంలోగా ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో అధికారుల లోపాలు వెల్లడికావడంతో గత వారం ఆసుపత్రికి సీల్ వేశారు. ఆస్పత్రిని ఖాళీ చేయకపోతే బుల్డోచర్‌తో కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన నోటీసులకు ఆసుపత్రి అధికారులు సమాధానం ఇవ్వలేదని, ఈ ఏడాది ప్రారంభంలో కూల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు నోటీసులో పేర్కొన్నారు.
Grace Children Home Incharge: అకౌంటెంట్ అత్యాచారంపై మాకు చెప్పలేదు.. ఇప్పుడు ఎందుకు
35 ఏళ్ల డెంగ్యూ రోగి మృతి చెందిన తరువాత ప్రాథమిక దర్యాప్తులో..ఆ రోగికి బ్లడ్ ప్లేట్‌లెట్స్‌కు బదులుగా బత్తాయి జూస్ ఎక్కించారని, అందుకు ఆ ఆసుపత్రి అధికారుల అలసత్వం కారణమని వెల్లడైంది. దీంతో గత వారం ఈ ఆసుపత్రిని సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేరని తెలిపారు. ప్లాస్మాకు బదులు బత్తాయి రసాన్ని ఎక్కించారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. మరో ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ప్లేట్‌లెట్ బ్యాగ్‌లో జ్యూస్ ఉందా లేదా అనే దానిపై వైద్య నివేదిక బహిరంగపరచబడలేదు. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగి కుటుంబీకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు డెంగ్యూ రోగి మరణం అనంతరం ప్రయాగ్‌రాజ్ పోలీసులు నకిలీ ప్లేట్‌లెట్స్ సరఫరా చేసే ముఠాను ఛేదించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఎస్పీ శైలేష్ కుమార్ పాండే వెల్లడించారు.