BV Raghavulu: ఆయన విశ్వగురు కాదు.. విశ్వ తొత్తు అని పేరు పెట్టొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరి దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ అకస్మాత్తుగా దాడులు చేయడం అనైతికమని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని, మారణకాండ కొనసాగుతుందని అమెరికా ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను కూడా ఆయన విమర్శించారు.
Read Also: Iran-China: హార్ముజ్‌ను తెరిచి ఉంచండి.. ఇరాన్‌పై చైనా తీవ్ర ఒత్తిడి!
Also Read
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహుతో జరిగిన సమావేశాలు, విందు భోజనాల నేపథ్యంలో భారత్.. ఇరాన్‌పై దాడులకు పరోక్ష మద్దతు ఇస్తోందన్న భావన కలుగుతోందని రాఘవులు విమర్శించారు.. భారత విదేశాంగ విధానాన్ని శాంతి, చర్చల దిశగా మళ్లించాలని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి భద్రతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. యుద్ధ పరిస్థితుల్లో అక్కడి భారతీయుల రక్షణకు సమగ్ర కార్యాచరణ అవసరమన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిళ్ల ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు. అమెరికా విధించిన సుంకాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం కూడా దేశ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఇక, మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని, విద్యుత్ చట్ట సవరణల ద్వారా పేదలపై ప్రతికూల ప్రభావం పడుతోందని విమర్శించారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు..
తాజావార్తలు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
-
Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
-
Royal Enfield Classic 650 Hypershift: రాయల్ ఎన్ఫీల్డ్ Classic 650 Hypershift ఎడిషన్ లాంచ్.. 648cc ఇంజిన్, ధర ఎంతంటే?!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!