ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని సీరియల్ కిల్లర్ సంచరిస్తున్నాడు. హంతకుల కోసం ఆరు పోలీసు బృందాలు వెతుకులాటలో నిమగ్నమయ్యాయి.
ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏళ్ల యువతిని కారు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనను మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ ఘటనపై చర్చ జరుగుతుండగానే యూపీలోని బాండాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు సిజేరియన్ నిర్వహించిన వైద్యులు గర్భంలో టవల్ పెట్టి అలాగే కుట్లు వేసిన ఘటన యూపీలోని అమ్రోహాలో జరిగింది.
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంటికి పొరుగున ఉండే 18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసి ఆపై విషం పెట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' తొమ్మిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నేడు పునఃప్రారంభం కానుంది. 110 రోజులకు పైగా సాగిన యాత్రలో ఇప్పటివరకు 3వేల కిలోమీటర్లకు చేరుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టుకు రీకౌంటింగ్ కట్టిన యువతికి విచిత్రమైన ప్రపోజల్ వచ్చింది. పరీక్షలో పాసయ్యేందుకు సహకరిస్తానని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తి యువతికి విచిత్రమైన ప్రతిపాదన పెట్టాడు. 'నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్ అయితే.. పరీక్షలో పాస్ చేస్తా' అంటూ యువతిని ప్రలోభపెట్టాడు.