గత వారం రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) ప్రాణాలు విడిచారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో గల మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడలేదు. ములాయం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. 2024కు ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బఘోలీ పీఎస్ పరిధిలోని సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవ అనే రైతు తాను పెంచుకుంటున్న దూడకు నవరాత్రుల మొదటి రోజున దుర్గా ఆలయంలో గుండు కొట్టించాడు.
అయోధ్య అనగానే అందరికి గుర్తొచ్చేది రాముడు పుట్టిన స్థలం అని.. అదే అయోధ్యలో ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గుడికట్టి రాముడిగా పూజిస్తున్న వార్త సంచలనం రేపుతోంది.
నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనే స్వయంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాజధాని లక్నో, ఉన్నావ్, ఫతేపూర్, సీతాపూర్లలో గోడలు, ఇల్లు కూలిన ఘటనల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు.