Corpse In Toilet: టాయిలెట్‌లో మృతదేహం.. 900 కిలోమీటర్లు ప్రయాణించిన రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corpse In Toilet: రైలులోని టాయిలెట్‌లో చనిపోయిన ఓ వ్యక్తిని ఎవరూ గుర్తించకపోవడంతో మృతదేహంతోనే రైలు దాదాపు 900 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉత్తరప్రదేశ్ షాజహాన్‌పూర్‌లోని రోజా స్టేషన్‌లో మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అమృత్‌సర్ వెళ్తున్న సహర్స-అమృతసర్ జన్‌సేవా ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది. టాయిలెట్ నుంచి దుర్వాసన వస్తోందని ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైలు బీహార్‌లోని బన్మంఖి నుంచి వస్తూ 900 కిలోమీటర్లు ప్రయాణించినా టాయిలెట్‌లో వ్యక్తి చనిపోయిన ఉన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. సాధారణ రైలు కంపార్ట్‌మెంట్‌లోని కొంతమంది ప్రయాణికులు వాష్‌రూమ్ నుండి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేయడం ప్రారంభించిడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
చివరికి రోజా స్టేషన్‌లో జీఆర్‌పీ సిబ్బంది టాయిలెట్ తాళాల్ని పగలగొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో రైలు దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. బాధితుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో గుర్తించడం కష్టమవుతోందని పోలీసులు తెలిపారు. బాధితుడు గ్రీన్ షర్ట్, బ్లూ ప్యాంట్ ధరించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇతర స్టేషన్లకు చేరవేసినట్టు పోలీసులు తెలిపారు. బీహార్ నుంచి రైలు బయలుదేరడానికి రెండు రోజుల ముందు ఆ వ్యక్తి రైలు ఎక్కి, డోర్ లాక్ చేసి లావెటరీలోనే చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దుర్వాసన వస్తున్నట్టు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ఆదివారం బలవంతంగా టాయ్‌లెట్ తలుపులు తెరిచామని రైల్వే పోలీసు అధికారి రామ్ సహాయ్ పేర్కొన్నారు.
Also Read
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు
బన్మింఖి నుంచి బయలుదేరిన రైలు బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా మీదుగా దాదాపు 35 గంటలు ప్రయాణించి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుతుంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో చనిపోయిన వ్యక్తిని గుర్తించడానికి అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైలును ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో దాదాపు ఐదు గంటలపాటు నిలిపివేశారు. మృతుడు టాయిలెట్‌కి వెళ్లిన అనంతరం కోమాలోకి జారిపోవడంతో మరణించినట్లు రైల్వే ఆసుపత్రి వైద్యుడు సంజయ్ రాయ్ వెల్లడించారు. ఆ వ్యక్తి గురించి వివరాలు తెలుసుకోవడానికి అన్ని స్టేషన్లలో పోస్టర్లు వేశారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పదివేల మృత దేహాలు క్లెయిమ్ చేయబడకుండా, గుర్తించబడకుండా పోతున్నాయి. మరణించిన వారి స్నేహితులు లేదా బంధువులను గుర్తించే ప్రయత్నాలను అనుసరించి మూడు రోజుల తర్వాత వారిని సాధారణంగా పోలీసులు దహనం చేస్తారు.
తాజావార్తలు
-
Viral News: చెప్పులు చేతిలో పట్టుకుని పరుగెత్తింది.. కూతుళ్ల చదువు కోసం మారథాన్ గెలిచిన తల్లి కథ!
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!