Ghaziabad Jail: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైలులో మొత్తం 5500మంది జైలు శిక్ష అనుభిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా అధికారులు వెల్లడించారు. మరో 17మంది టీబీతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. హెచ్ఐవీ రోగులందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. ఖైదీలందరికీ ఓపీడీ కార్డులను తయారు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జైలు సామర్థ్యం 1704 కాగా, ఐదు వేల మందికి పైగా ఖైదీలను ఈ జైలులో ఉంచారు. ఖైదీల సాధారణ ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ సమయంలో మరో 35 మంది ఖైదీలకు టీబీ కూడా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారి తెలిపారు.
Read Also: Ivana trump Bunglow : త్వరపడండి.. అమ్మకానికి ఇవానా ట్రంప్ భవనం
దస్నా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరుగుతాయని, ఇందులో హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని చెప్పారు. హెచ్‌ఐవీ అంటరానితనం వల్ల వచ్చే వ్యాధి కాదని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు. రోజూ తనిఖీలు చేస్తున్నారు. కొత్త ఖైదీలు జైలుకు వచ్చినప్పుడు ఇలాంటి టెస్టులు మామూలుగానే నిర్వహిస్తారు. ఈ సంఖ్య దాదాపు 125-150గా ఉంటుంది. వీరిలో అధిక సంఖ్యలో ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలని చెప్పారు. డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని అధికారులు చెబుతున్నారు.