Boy Recused: బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు.. సేఫ్‌గా బయటకు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Recused From Borewell: నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి అకస్మాత్తుగా 40 అడుగుల లోతు గల బోరుబావిలో పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో చోటుచేసుకుంది. హాపూర్‌లోని కోట్లా సాదత్ ప్రాంతంలో బోరుబావిలో పడిపోయిన నాలుగేళ్ల బాలుడిని 5 గంటల ఆపరేషన్ తర్వాత సురక్షితంగా బయటకు తీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం బాలుడిని విజయవంతంగా రక్షించిందని.. అతను వైద్య పరిశీలనలో ఉన్నాడని.. సరైన చికిత్త అందిస్తున్నారని ఎస్పీ దీపక్ భుకర్ విలేకరులతో వెల్లడించారు.
హాపూర్‌లోని కోట్లా సాదత్ ప్రాంతానికి చెందిన మోశిన్ కుమారుడు మావియా ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పిల్లాడిని రక్షించేందుకు ప్రయత్నించారు. బాలుడికి ఊపిరి ఆడేందుకు వీలుగా బోరుబావిలోకి ఆక్సిజన్‌ను పంపించారు. కొన్ని గంటలు శ్రమించి ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ బోరుబావిని 35 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ అధికారులు తవ్వారు. గత 10 ఏళ్లుగా ఈ బోరుబావి నిరుపయోగంగా ఉందని స్థానికులు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం బాలుడిని బయటకు తీయడంతో స్థానికులు చప్పట్లతో వారికి అభినందనలు తెలిపారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Covid19 : కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఉపశమనం లేదా.. అయితే ఏం చేయాలి..?
రెస్క్యూ ఆపరేషన్ గురించి ఎన్డీఆర్‌ఎఫ్ అధికారి వివరిస్తూ.. “రెస్క్యూ ఆపరేషన్ 4-5 గంటల పాటు కొనసాగింది. ఎన్డీఆర్‌ఎఫ్‌కి నైపుణ్యం ఉంది. దీని ద్వారా దేశంలో అలాంటి ఆపరేషన్ ఏదైనా విజయవంతంగా చేపట్టవచ్చు. మా ప్రయత్నం చిన్నారిని రక్షించడం, వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించడం.” అని చెప్పారు. ఈ ఆపరేషన్ ఎంతో సవాల్‌తో కూడుకున్నదని వెల్లడించారు. బాలుడికి మాటలు రావని.. అతడు మాట్లాడులేడు కాబట్టి సుశిక్షితులైన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు ఓపికతో పని చేశారన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను 47 మంది సభ్యుల బృందం నిర్వహించిందని తెలిపారు. ఆ బాలుడు పగటిపూట ఆడుకుంటూ తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడని అధికారులు తెలిపారు. బోరుబావి విషయంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రూపమ్ తెలిపారు. చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
#WATCH | Uttar Pradesh: Four-year-old child who fell into a borewell in Hapur district, has been safely rescued by the NDRF team. pic.twitter.com/vhLf2nXMzr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 10, 2023
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!