Woman Harassed by Gang: భారత్ లో రోజురోజుకు మహిళపై దాడులు ఎక్కువవుతున్నాయి. దేశంలో ప్రతి గంటకు ఏదో ఒక చోట మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వీటి నియంత్రణ కష్టతరమవుతోంది. ఇలాంటి దాడులకు పాల్పడిన నిందితులకు శిక్షలు వేసినా.. వాటిని చూసైనా కీచకులు మారడంలేదు. ఈ రోజూ మరో విస్తుపోయే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. షేర్ టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్ ఏరియాలో వదిలి పారిపోయారు. బాధితురాలు ఎలాగోలా కోలుకుని ఎత్మాద్‌పూర్ పోలీసులను ఆశ్రయించింది.
Read Also : TikTok Ban in US: టిక్ టాక్‌కు షాక్.. యాప్ ను నిషేదించిన అమెరికా
తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసింది. తాను షేర్డ్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గురు యువకులు ఎక్కారని పోలీసులకు తెలిపింది. కొంత దూరం వెళ్లాక, ఆ ముగ్గురూ కలిసి తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను కనిపెట్టేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించారు పోలీసులు. మహిళలపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం.
Read Also: Omicron BF7 : చైనా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్.. అలెర్టైన ప్రభుత్వం