Uttarpradesh: పొగమంచు కారణంగా పెరుగుతున్న ప్రమాదాల కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బస్సులు రాత్రిపూట నిలిచిపోతాయని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ ఇవాళ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కారణంగా సరిగా రోడ్డు కనిపించక జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని, 39 మంది గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Drugs Seized: చెన్నై ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ గుట్టురట్టు చేసిన స్నైపర్ డాగ్.. వీడియో వైరల్
“దట్టమైన పొగమంచు, పెరుగుతున్న ప్రమాదాల కారణంగా ప్రభుత్వం రాత్రిపూట ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (UPSRTC) బస్సులను నడపకుండా నిలిపివేసింది. ఈ విషయంలో కార్పొరేషన్ ప్రాంతీయ మేనేజర్లకు ఒక ఉత్తర్వు జారీ చేయబడింది,” అని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ విలేకరులతో అన్నారు. అయితే కొత్త బస్సుల సమయాలను మాత్రం ఆయన వివరించలేదు. దట్టమైన పొగమంచు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని లక్నోలోని వాతావరణ కేంద్రం తెలిపింది.