Viral Letter: తన భార్య తనపై అలిగిందని.. ఆమెను బుజ్జగించడానికి సెలవు కావాలని ఓ కానిస్టేబుల్ ఏఎస్పీకి లెటర్ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని పోలీసు కానిస్టేబుల్ సెలవుపై రాకపోవడంతో అతని భార్య అతని కాల్‌లను తీయడం మానేసింది. నెల రోజుల క్రితం వివాహమైనా కానిస్టేబుల్ ఇంటికి రాకపోవడంతో భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కానిస్టేబుల్ సెలవు కోసం డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాస్తూ తన బాధను వ్యక్తం చేశాడు.
‘వివాహం జరిగి నెల కూడా గడవకముందే.. భార్యను వదిలి వచ్చినందుకు.. తను నాపై అలిగింది. నేను కాల్ చేసినా నో రెస్పాన్స్. వెళ్లి ఆమెకు సర్ది చెప్పాలి. లీవ్ ఇవ్వండి.’ అంటూ పైఅధికారికి లీవ్ లెటర్ రాశాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్. గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్ 2016 బ్యాచ్‌కు చెందినవాడు. మౌ జిల్లాలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం మహారాజ్‌గంజ్ జిల్లాలోని నౌత్వానా పోలీస్‌స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నాడు. గౌరవ్‌కు ఇటీవల డిసెంబర్‌లో వివాహం జరిగింది. అనంతరం తన భార్యను ఇంటి వద్ద వదిలి వచ్చి విధులకు హాజరవుతున్నాడు. అయితే విధులకు వెళ్తూ వెళ్తూ.. మేనల్లుడి బర్త్ డేకు వారం రోజులు లీవ్ తీసుకుని వస్తానని భార్యకు చెప్పాడు. కానీ దానికి ముందుగానే అతడి భార్య ఫోన్‌కాల్స్‌కు రెస్పాండ్ అవ్వడం మానేసి తన కోపాన్ని చూపుతోంది.
Cyber Crime: ఫ్రై వైఫై వాడాడు.. రూ. 50 వేలు పోగొట్టుకున్నాడు
దీంతో పరిస్థితిని వివరిస్తూ ఆ కానిస్టేబుల్ సెలవుల కోసం ఏఎస్పీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఆ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “పెళ్లి అయిన తర్వాత ఇంటికి వెళ్లనప్పుడు భార్య పదే పదే ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేస్తోంది, కొన్నిసార్లు ఆమె ఫోన్ చేసినప్పుడు ఆమె తల్లికి ఫోన్ ఇస్తుంది… అందుకే నాకు సెలవు కావాలి.” అంటూ లేఖలో రాసుకొచ్చాడు. సాటి మగాడిగా.. ఓ భర్తగా ఆ కానిస్టేబుల్ ఇబ్బంది అర్థం చేసుకొన్న ఏఎస్పీ అతీశ్ కుమార్ సింగ్.. 5రోజులు లీవ్స్ ఇచ్చాడు. గౌరవ్ లీవ్స్ జనవరి 10న ప్రారంభం కానున్నాయి.