Israel-Iran War: అయోధ్యలో ‘‘ఇజ్రాయిల్ ప్రధాని’’ కోసం పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తపస్వి ఛావని పీఠాధిపతి జగద్గురు పరమహంసాచార్య మంగళవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు అందించారు. ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆయన ఫోటోకు తిలకం పెట్టి పూజలు నిర్వహించారు. నెతన్యాహూ ‘‘మహాపురుషుడు’’ అంటూ కొనియాడారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళన పేరుతో మహిళలపై, చిన్నపిల్లలపై అమానుష చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయిల్ చేపడుతున్న సైనిక చర్యను ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటంగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహూకు మద్దతు తెలిపిన విషయాన్ని ప్రస్తావించారు.
పరమహంసాచార్య మాట్లాడుతూ.. అమాయకులను హతమార్చే వారు ఉగ్రవాదులే అని, అలాంటి వారిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. మానవత్వ రక్షణ కోసమే ఇజ్రాయిల్ ఈ యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు. భగవాన్ శ్రీరాముడు అధర్మాన్ని నిర్మూలించినట్లే, భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కట్టుబడి ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్ఛారణలతో పాటు అనుష్టానాలు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!