Girl Friend Offer: గర్ల్‌ఫ్రెండ్‌గా మారితే పరీక్షలో పాస్ చేస్తా.. నో చెప్పిన యువతికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Friend Offer: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టుకు రీకౌంటింగ్ కట్టిన యువతికి విచిత్రమైన ప్రపోజల్ వచ్చింది. పరీక్షలో పాసయ్యేందుకు సహకరిస్తానని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తి యువతికి విచిత్రమైన ప్రతిపాదన పెట్టాడు. ‘నువ్వు నా గర్ల్‌ఫ్రెండ్ అయితే.. పరీక్షలో పాస్ చేస్తా’ అంటూ యువతిని ప్రలోభపెట్టాడు. అంతేకాకుండా రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీనికి యువతి నో చెప్పింది. దీంతో తరచుగా కాల్స్ చేస్తూ విసిగించడం ప్రారంభించాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ.. మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులకు గురి చేశాడు. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
Audio Clip Leaked: ఇమ్రాన్ ఖాన్ అశ్లీల ఆడియో క్లిప్ లీక్.. అది ఫేక్ అంటోన్న పీటీఐ
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
బాధిత యువతి మహరాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తోంది. కాన్పూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటోంది. ఇటీవల వచ్చిన రిజల్ట్స్‌లో ఆమె గణితం సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయింది. కేవలం 11 మార్కులే వచ్చాయి. దీంతో ఆ సబ్జెక్ట్‌కు రీకౌంటింగ్ కట్టింది. నవంబరులో ఆమె మొబైల్ నంబరుకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోను, మెసేజ్ వచ్చింది. పరీక్షలో పాస్ కావాలనుకుంటే.. నాకు రూ.5 వేలు ఇవ్వు… నా గర్ల్‌ఫ్రెండ్‌గా మారు అంటూ మెసేజ్‌లో ఉంది. ఆ వ్యక్తి ప్రతిపాదనను యువతి తిరస్కరించింది.తీరా రీకౌంటింగ్ ఫలితాలు చూసుకునే సరికి షాక్. మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో యువతి మళ్లీ ఫెయిల్ అయింది. గతంలో 11 మార్కులు రాగా.. రీకౌంటింగ్‌లో సున్నా వచ్చాయి. ఇది తనకు కాల్ చేసిన వ్యక్తి పనే అన్న అనుమానంతో పోలీసులను ఆశ్రయించింది. గుర్తుతెలియని యువకుడు తనకు మళ్లీ కాల్ చేసి బెదిరించాడని యువతి వాపోయింది. తన భవిష్యత్‌ను నాశనం చేస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!