PM Modi: కుటుంబం లేదని అంటున్నారు.. కానీ, దేశంలోని 140 కోట్ల మంది ‘మోడీ కా పరివార్’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్ అజాంగఢ్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని రూ. 34 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించారు. భారతదేశ ప్రగతిపై అసంతృప్తితో, ఎన్నికల ముందు అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్నికల ఎర అని కొందరు అంటున్నారు.. గత నాయకులు ఎన్నికల ముందు పథకాలు, ప్రాజెక్టులను ప్రకటిస్తారు కానీ పూర్తి చేసేవారు కాదని ప్రధాని అన్నారు. గతంలో తాను పునాది వేసిన ప్రాజెక్టులను ప్రారంభించడం దేశ ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు.
Read Also: Pakistan: “ప్లీజ్, మా వాళ్ల జాడ కనుక్కోండి”.. భారత్ సాయం కోరిన పాకిస్తాన్..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధిని విపక్షాలు చూడలేక పోతున్నాయని, వారి బుజ్జగింపు రాజకీయాలు క్షీణిస్తున్నాయని ప్రధాని విమర్శించారు. కుటుంబ రాజకీయాలు చేసే వారు రోజురోజుకి మోడీని ద్వేషిస్తున్నారని, మోడీకి సొంత కుటుంబం లేదని అంటున్నారని, అయితే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తన కుటుంబమే ‘మోడీకా పరివార్’ అని మరిచిపోయారని చెప్పారు. ఆజంగఢ్‌పై ప్రేమ-అభివృద్ధి చూపించడం కులతత్వం, వంశ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే ఇండియా కూటమికి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. దశాబ్ధాలుగా పూర్వంచల్ ప్రాంతం కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలను చూస్తోందని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో గత 7 ఏళ్లలో అభివృద్ధి చెందిందని ప్రధాని చెప్పారు.
ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ మొత్తం రూ.34,000 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పౌర విమానరంగాన్ని ప్రోత్సహించే విధంగా.. పూణే, కొల్హాపూర్, గ్వాలియర్, జబల్పూర్, ఢిల్లీ, లక్నోతో సహా విమానాశ్రయాలలో 12 కొత్త టెర్మినల్ భవనాలను ఆయన ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!