IAS Officer: పేషెంట్‌లా ఆస్పత్రికొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది ప్రభుత్వాస్పత్రి.. లోపల ఏం జరుగుతుందో.. రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందో.. డాక్టర్లు, సిబ్బంది ఎలా పని చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్. అంతే ఎలాంటి హంగు, ఆర్భాటాలతో కాకుండా ఒక సామాన్య పేషేంట్‌లా ఆస్పత్రి లోపలికి ఎంట్రీ ఇచ్చారు.. ఆస్పత్రి మొత్తం కలయ తిరిగి చూశారు. లోపల జరుగుతున్న బాగోతం చూసి తన ప్రతాపాన్ని చూపించారు ఆఫీసర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఫిరోజాబాద్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోకి ఐఏఎస్ అధికారి క్రతిరాజ్ రహస్యంగా రోగిలా మారువేషంలో ప్రవేశించారు. ఆస్పత్రి అంతటిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడ జరుగుతున్న లోపాలను గుర్తించారు. ఇంత జరుగుతున్న ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం కనిపెట్టలేకపోయారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రోగులు ఎదుర్కొంటున్న అసౌకర్యాల గురించి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ మేరకు ఆమె రహస్య పరిశోధనకు పూనుకున్నారు. ఆమె గుర్తింపును దాచిపెట్టి వైద్య విభాగాల్లోకి చొరబడ్డారు. రహస్య ఆపరేషన్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారు. డాక్టర్ల గైర్హాజరు కావడమే కాకుండా పని చేస్తున్న సిబ్బంది పని తీరు కూడా ఏ మాత్రం సరిగ్గా కనిపించలేదు. దీంతో ఆమె డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఔషధాలు పంపిణీ చేసే స్టోర్ రూమ్‌ను కూడా పరిశీలించారు.. అన్ని మందులు గడువు ముగిసిన మందులుగా గుర్తించి విసిరి పారేశారు. అలాగే మరికొన్ని ప్రమాదకరమైన మందులను గుర్తించారు. ఆస్పత్రిలో అవసరమైన సిబ్బంది ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తు్న్నారంటూ మండిపడ్డారు. అలాగే ఆస్పత్రిలో ఎక్కడా కూడా పరిశుభ్రత కనిపించలేదు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో మండిపడ్డారు.
అలాగే కొంత మంది డాక్టర్లు.. రోగులతో సరైన విధంగా వ్యవహరించకపోవడాన్ని కూడా ఆమె గుర్తించారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఆమె.. దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ క్రతి రాజ్ ఆరోపణలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబదన్ రామ్ ఖండించారు. గడువు ముగిసిన మందులను ఉపయోగించడంలేదని.. అలాంటి మందులను ఓ పెట్టెలో పెట్టి దాచినట్లు చెప్పారు. అలాగే ఆస్పత్రిలో కూడా పరిశుభ్రత బాగానే ఉందని ఆయన కితాబు ఇచ్చారు.
కృతి రాజ్.. ఉత్తరప్రదేశ్‌లోని సదర్‌కు చెందిన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డీఎం)గా పని చేస్తున్నారు. రహస్యంగా ఆస్పత్రిని పరిశీలించి విచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
#WATCH | Uttar Pradesh: Sub-Divisional Magistrate Sadar Kriti Raj inspected a government health centre in Firozabad, after receiving several complaints regarding inconveniences faced by patients.
(Source: SDM Office) pic.twitter.com/UZamZhpvxJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 13, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!