Marriage: ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి దళిత మహిళను పెళ్లి చేసుకునేందుకు తన గుర్తింపును దాచిపెట్టినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తబ్రేజ్ ఆలం అనే నిందితుడు తన పేరును ఆర్యన్ ప్రసాద్‌గా మార్చుకుని గోరఖ్‌పూర్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ఆ మహిళకు అబద్ధం చెప్పాడు. తబ్రేజ్ ఆలం ఆ మహిళతో ఒక సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఆమె కుటుంబానికి తెలియజేశారు. ఈ జంట వివాహం చేసుకోవాలనే ప్రతిపాదనను మహిళ కుటుంబ సభ్యుల ముందుకు తీసుకొచ్చారు. తబ్రేజ్ ఆలంకు ఇచ్చి పెళ్లి చేసేంందుకు వారు వెంటనే అంగీకరించారు. ఫిబ్రవరి 25న వారి పెళ్లి జరగాల్సి ఉండగా, తబ్రేజ్ ఆలం అబద్ధాలన్నీ బట్టబయలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Vishwak Sen: సోషల్ మీడియాలో ‘లేపుడు’ ట్రోల్స్.. ఘాటు కౌంటర్ ఇచ్చిన విశ్వక్!
పెళ్లి కోసం అంతా సిద్ధం చేశారు. పెళ్లి వారి కోసం మహిళ బంధువులు వేచి చూస్తుండగా.. తబ్రేజ్ ఆలం ఫోన్ చేసి తన తల్లికి గుండెపోటు వచ్చిందని చెప్పాడు. పెళ్లికి తమ కుటుంబసభ్యులు ఊరేగింపుగా వచ్చే అవకాశం లేదని మహిళ కుటుంబీకులకు చెప్పాడు. తబ్రేజ్ ఆలం ఒంటరిగా అలంకరించబడిన కారులో వివాహ వేదిక వద్దకు వచ్చాడు. అనంతరం కార్యక్రమానికి సిద్ధం చేసిన వేదికపై వధూవరులు దండలు మార్చుకున్నారు. వేడుక తదుపరి భాగం వరుడు వధువుకు బట్టలు, నగలు ఇవ్వవలసి ఉంది. వధువు కుటుంబీకులు ఆ నగలు నకిలీవని అనుమానించగా, త్వరితగతిన తనిఖీ చేయడంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. కొద్దిసేపటికే ఒక వివాదం మొదలైంది. అది తీవ్రరూపం దాల్చడంతో తబ్రేజ్ ఆలం తలపై నుంచి విగ్గు పడిపోయింది. దీంతో అక్కడి వారంతా అవాక్కయ్యారు. అతడిని పట్టుకుని తనిఖీ నిర్వహించారు. అతని జేబులో అతని ఆధార్ కార్డును కనుగొన్నారు. అతను తన గుర్తింపు గురించి అబద్ధం చెప్పాడని, పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు చెప్పి మహిళను ఆకర్షించాడని వారు గ్రహించారు. వెంటనే ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వివాహ వేదిక వద్దకు చేరుకుని తబ్రేజ్ ఆలంను అదుపులోకి తీసుకున్నారు. తబ్రేజ్ ఆలంపై కేసు నమోదు చేసినట్లు సౌత్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభినవ్ త్యాగి తెలిపారు.