Mukhtar Ansari: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ ముఖ్తార్ అన్సారీ జైలులో మరణించాడు. దాదాపుగా 60కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని జైలులో స్పృహ తప్పిపోయిన స్థితిలో సిబ్బంది గుర్తించి, హుటాహుటిని బండలోని రాణి దుర్గావతి వైద్య కళాశాలకు తరలించగా, గురువారం రాత్రి మరణించాడు. అయితే, అతడిపై స్లో పాయిజన్ అటాక్ జరిగిందని, అతడి కొడుకు, కుటుంబ సభ్యులు ఆరోపించిన నేపథ్యంలో తాజాగా వచ్చిని అటాప్సీ రిపోర్ట్ కీలక విషయాన్ని వెల్లడించింది. ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతోనే మరణించినట్లు ధ్రువీకరించింది.
Read Also: MK Stalin: “మోడీ కళ్లు కూడా ఆయన కన్నీళ్లను నమ్మవు”.. ప్రధానిపై స్టాలిన్ కామెంట్స్..
ఉత్తర్ ప్రదేశ్ మావు నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచిన ఈ మాజీ ఎమ్మెల్యేపై తీవ్రమైన కేసులు ఉన్నాయి. ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఉమర్ అన్సారీ తన తండ్రికి జైలులో స్లో పాయిజనింగ్‌కి గురయ్యాడని ఆరోపించాడు. అతనికి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. బండాలోని స్థానిక పరిపాలను, వైద్య వ్యవస్థపై తమకు తమకు నమ్మకం లేదని చెప్పారు.
శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో ముఖ్తార్ అన్సారీ గుండెపోటు(మయోకార్డియల్ ఇన్ఫార్షన్) వల్ల మరణించినట్లు తెలిపింది. ఐదుగురు వైద్యులతో కూడిన బృందం శవపరీక్ష నిర్వహించింది. రాణి దుర్గావతి మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించినప్పుడు అతని చిన్న కుమారుడు ఉమర్ అన్సారీ అక్కడే ఉన్నాడు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని బండాల నుంచి సొంత జిల్లా ఘాజీపూర్‌కి తీసుకెళ్లారు. శనివారం ఉదయం అతడి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు.