Mukhtar Ansari: రంజాన్ మాసంలో అన్సారీని దేవుడు శిక్షించాడు.. బీజేపీ ఎమ్మెల్యే ఫ్యామిలీ హర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ నిన్న జైలులో గుండెపోటుతో మరణించాడు. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన అన్సారీ ఒకానొక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పాడు. తనకు అడ్డొచ్చిన వాళ్లకు చావు భయాన్ని చూపాడు. తాజాగా అన్సారీ మరణంతో ఆయన వల్ల బాధింపడిన కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్తాన్ అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కుటుంబం తమకు న్యాయం జరిగింది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంజాన్ మాసంలో ముఖ్తాన్ అన్సారీ భవిష్యత్తును దేవుడు నిర్ణయించాడని అన్నారు. 2005లో, కృష్ణానంద్ రాయ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించి ఇంటికి తిరిగి వస్తుండగా, అతని కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో కృష్ణానంద్ రాయ్ మరియు అతని ఆరుగురు సహాయకులు AK-47 బుల్లెట్లతో కాల్చి చంపబడ్డారు. ఏప్రిల్ 2023లో, ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని కోర్టు కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Read Also: Tapsee Pannu:ఈ రొమాన్స్ ఎప్పటికీ ముగియదు.. పెళ్లి అనంతరం తాప్సీ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Also Read
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణానంద్ రాయ్ కుమారుడు పీయూష్ రాయ్ మాట్లాడుతూ.. తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్తాన్ అన్సారీ నిరంకుశుడు అని అన్నారు. మేము చాలా సంతోషిస్తు్న్నామని, ఇది బాబా గోరఖ్‌నాథ్ దయ, అతను పంజాబ్ జైళ్లలో ఉంటూ నేరాలకు పాల్పడే వాడు, ఉత్తర్ ప్రదేశ్ వచ్చిన తర్వాత తమకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు. అన్సారీ మృతిపై ప్రతిపక్షాల రాజకీయాలపై పీయూష్ రాయ్ మండిపడ్డారు.
మౌ సదర్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ అన్సారీని గురువారం సాయంత్రం స్పృహ లేని స్థితిలో జైలు నుంచి రాణి దుర్గావతి వైద్య కళాశాలకు తీసుకువచ్చారు. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 2005 నుంచి ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ జైళ్లలో ఉంటున్న 60 ఏళ్ల అన్సారీపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు జారీ చేసిన 66 మంది గ్యాంగ్‌స్టర్లలో ఇతని పేరు కూడా ఉంది.
తాజావార్తలు
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!