RKS Bhadauria: లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీల నుంచి బీజేపీకిలో చేరుతున్నారు. తాజాగా భారత వాయుసేన మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఆదివారం బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ ప్రధాని కార్యదర్శి వినోద్ తావ్దే సమక్షంలో పార్టీలో చేశారు. భారతదేశ వైమానిక(ఐఏఎఫ్)లో భదౌరియాలో సుదీర్ఘ సేవలందించారని ఆయన కొనియాడరు. భదౌరియా దాదాపుగా 40 ఏల్ల ఏఐఎఫ్‌లో సేవలందించారని, ప్రధాని నరేంద్రమోడీ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి సహకరించారని బీజేపీ నేత చెప్పారు.
Read Also: Onion exports: ఉల్లి ఎగుమతుల కేంద్రం కీలక నిర్ణయం.. నిషేధం పొడగింపు..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీలోకి ఆయన చేరిక ఆసక్తికరంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భదౌరియా ఎన్నికల బరిలో నిలుస్తారని సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఉత్తర్ ప్రదేశ్ లోని పలు స్థానాలకు బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. యూపీలోని ఏదో స్థానం నుంచి భదౌరియా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.