Earthquake: ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్.. ఇరాన్‌లో భూకంపం.. 4.1గా నమోదు
- ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్
- ఇరాన్‌లో భూకంపం.. 4.1గా నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాంబులతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్, అమెరికా ఎడాపెడా దాడులు చేస్తోంది. గత శనివారం నుంచి ఏకధాటిగా దాడులు చేస్తోంది. దీంతో ఇరాన్‌లో బీభత్సం జరుగుతోంది. తాజాగా టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో భూకంపం సంభవించింది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లుగా నివేదికలు లేవు.
USGS డేటా ప్రకారం.. శనివారం ఉదయం బందర్ అబ్బాస్‌కు పశ్చిమాన 74 కిలోమీటర్ల దూరంలో… 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. 4.1 తీవ్రతతో వచ్చే భూకంపాన్ని తేలికపాటి లేదా మితమైన భూకంపంగా పరిగణిస్తారు. భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న నివాసితులకు స్వల్పంగా ప్రకంపనలను సంభవించి ఉండవచ్చు.. పెద్దగా నష్టాన్ని కలిగించవు. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
మంగళవారం కూడా దక్షిణ ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది. స్థానిక సమయం ఉదయం 10:24 గంటలకు నమోదైంది.
ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చాయి. ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు నేలరాలిపోయారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్, అమరికాకు మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో పశ్చిమాసియా ప్రస్తుతం అగ్నిగుండంగా మారింది.
ఇది కూడా చదవండి: US-Israel-Iran Tensions: బాంబులు.. క్షిపణులు.. యుద్ధాలు..! భూమి వాతావరణానికి పెరుగుతున్న ముప్పు.. మరణాలు పెరుగుతాయా?
ఇరాన్ సైన్యం తుడుచుకు పెట్టుకుపోయిందని… వారి నావికాదళం కూడా పోయిందని.. అలాగే వారి కమ్యూనికేషన్లు కూడా దెబ్బతిన్నట్లుగా ట్రంప్ తెలిపారు. నాయకులు కూడా పోయారని పేర్కొన్నారు. ఇరాన్ దగ్గర 32 నౌకలు ఉన్నాయని.. మొత్తం సముద్రపు అడుగు భాగంలో ఉన్నాయని తెలిపారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోయింత వరకు చర్చలు జరపబోమని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ఎలాంటి చర్చలు జరపబోమని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!