యూపీ పోలీసుల ఓ సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఒక మహిళను చెంపదెబ్బ కొట్టడం కనిపిస్తుంది. అంతేకాకుండా.. తన వద్ద ఉన్న పిస్టల్ తీసి భయపెట్టాడు. కాగా.. ఈ వీడియో వైరల్ కావడంతో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి దర్యాప్తుకు ఆదేశించారు.
Read Also: Wayanad landslides: ముగిసిన సహాయ చర్యలు.. ఆర్మీకి ఘనంగా వీడ్కోలు
వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగింది. సాదా యూనిఫాంలో ఉన్న ఎస్సై కారులో వెళ్తుండగా.. ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్‌కు డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఘటన సమయంలో ఆటోలో కూర్చున్న మహిళ నిరసన వ్యక్తం చేయడంతో.. ఇన్‌స్పెక్టర్ తన పిస్టల్‌ను తీసి కారులోంచి బయటకు వచ్చాడు. కోపంతో ఆ మహిళను దుర్భాషలాడుతూ పలుమార్లు చెప్పుతో కొట్టాడు. అలాగే పిస్టల్ తీసి భయపెట్టాడు. ఇది చూసిన పలువురు అక్కడ గుమిగూడారు. ఇన్ స్పెక్టర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై తగిన చర్యలు తీసుకోవాలంటూ మండిపడ్డారు.
Read Also: CM Chandrababu: సామాన్య కార్యకర్తలను మరువని చంద్రబాబు.. ప్రత్యేకంగా పిలిచి మరి..!
కాగా.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై తక్షణమే చర్యలు చేపట్టినట్లు హాపూర్ ఏఎస్పీ వినీత్ భట్నాగర్ తెలిపారు. నిందితుడు ఇన్‌స్పెక్టర్ షేర్ సింగ్‌ను సస్పెండ్ చేశామన్నారు. ఈ విషయంపై అతనిపై విచారణ చేపట్టామని తెలిపారు. మూడు రోజుల క్రితం బులంద్‌షహర్ పోలీసుల వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. పోలీసులు తమ బైక్‌లోని పిస్టల్‌ను తీసి యువకుల కారులో పెట్టారు. అందులో పిస్టల్ దొరికిందని చెప్పి.. దానిని స్వాధీనం చేసుకుని అమాయక యువకులను జైలుకు పంపారు. అయితే.. వైరల్ వీడియో ద్వారా నిజానిజాలు బయటపడ్డాయి. దీంతో.. పోలీసులు పరువు తీయడంతో.. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసులను సస్పెండ్ చేశారు.
#WATCH | UP के हापुड़ जिले का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। वायरल वीडियो में एक दारोगा जो सिविल ड्रेस में है महिला को थप्पड़ मारते दिख रहा है। थप्पड़ मारने का वायरल वीडियो जब अफसरों तक पहुंचा तो दारोगा को सस्पेंड कर दिया गया।#UttarPradesh pic.twitter.com/EWbOrlL7ZF
— Hindustan (@Live_Hindustan) August 8, 2024