ఉత్తర్ ప్రదేశ్లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ ’తలాష్’ విజయవంతమైనందని పోలీసులు తెలిపారు. అతడి పేరుతో పాటు మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. యూపీ సీరియల్ కిల్లర్ పేరు కుల్దీప్ కుమార్ గంగ్వార్. అతడి వయస్సు 38ఏళ్లు. బరేలీ ప్రాంతంలో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హతమార్చాడు. పొలాల్లో ఒంరిగా పనిచేస్తున్న మహిళలే అతని టార్గెట్. అటవీ ప్రాంతాల్లోని మహిళలను కూడా అతని విడిచిపెట్టలేదు. జులై 2023- జులై 2024లో మధ్యలో బరేలీకి సమీపంలోని గ్రామాల్లో మహిళలను ఈ సీరియల్ కిల్లర్ చంపాడు. ఒంటరిగా కనపడిన మహిళల దగ్గరికి వెళ్లడం, లైంగికంగా వారికి దగ్గరవ్వడానికి ప్రయత్నించడం, ఒప్పుకోకపోతే.. తీవ్రస్థాయిలో కోపం తెచ్చుకుని, వారిని గొంతు నులిమి చంపడం ఈ సీరియల్ కిల్లర్కి అలవాటు. అనంతరం మహిళల లిప్స్టిక్లు, బిందీలు, ఐడీ కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
READ MORE: Crime: మొదట ప్రపోజ్ చేస్తాడు.. తిరస్కరిస్తే చంపేస్తాడు.. సీరియల్ కిల్లర్ కథ
కాగా.. ఈ దర్యాప్తులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ హత్యలు ఎందుకు చేశాడు? ఇంత దారుణంగా ఎలా చంపుతున్నాడు? దీనికి గల ఓ బలమైన కారణం బయట పడింది. తన తల్లి జీవించి ఉండగానే తన తండ్రి బాబూరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో భార్య కోరిక మేరకు మొదటి భార్యను తరచూ కొట్టేవాడు. ఈ కారణంగానే నిందితుడికి తన సవతి తల్లి పట్ల ద్వేషం కలిగింది. ఈ కారణంగా అతను ఆ వయస్సులో ఉన్న మహిళలను బలిపశువులను చేయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 9 మందిని అంతమొందించాడు.
READ MORE:Tollywood: బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు నో చెప్పిన భామలు ఎవరంటే..?
కుల్దీప్ని పట్టుకునేందుకు ఆపరేషన్ తలాష్ని చేపట్టారు. ఇందులో భాగంగా జులైలో పోలీసులకు ఒక టిప్ వచ్చింది. దానిపై వారు వెంటనే స్పందించారు. షాహి, శీష్గఢ్ పోలీస్ స్టేషన్ల మధ్యలో 25 కి.మీల రేడియస్ని మార్క్ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.”యూపీ సీరియల్ కిల్లర్ని పట్టుకునేందుకు 22 బృందాలను ఏర్పాటు చేశాము. 1,50,000 అనుమానాస్పద మొబైల్ నెంబర్లను స్కాన్ చేశాము. 1,500 సీసీటీవీ కెమెరాలను మానిటర్ చేశాము. క్రైమ్ ప్యాటర్న్ని దర్యాప్తు చేశాము,” అని బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య తెలిపారు.