Atrocious: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి.. సాయం చేసిన అన్నదమ్ములు
- యూపీలోని ఫిరోజాబాద్‌లో దారుణం
- మద్యం మత్తులో భార్యను కట్టేసి కొట్టిన భర్త
- అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం
- తీవ్రంగా మహిళను కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఫిరోజాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దారుణానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో భర్త భార్యను తాళ్లతో కట్టేసి కొట్టాడు. అంతేకాకుండా.. ఆపాల్సింది పోయి అన్నకు సాయం చేసేందుకు తమ్ముళ్లు సహకారం అందించారు. తీవ్రంగా ఆ మహిళను కొట్టడంతో చనిపోయింది. మహిళ మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించగా.. పోస్టుమార్టం నివేదికలో మహిళపై జరిగిన దారుణం బయటపడింది. పోస్టుమార్టంలో మహిళ పేగు దగ్గర ఎనిమిది అంగుళాల పైప్ లభ్యమైంది. రిపోర్టు చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు.
Read Also: Pushpa 2: గళ్ళ లుంగీ.. గన్ విత్ గొడ్డలితో ఫహాద్
Also Read
ఈ ఘటన మత్సేనా ప్రాంతంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త.. భార్య నిరసన వ్యక్తం చేయడంతో అతడు ఆమెను కొట్టడం ప్రారంభించాడు. భర్త మొదట భార్య కాళ్లకు తాడుతో కట్టాడు. ఆ తర్వాత అతని నోరు మూశారు. దీంతో భర్త భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. ఈ సమయంలో భర్త తన ఇద్దరు సోదరులు కూడా హెల్ప్ చేశారు. ఆ మహిళను వేధించడంలో అన్నదమ్ములు కూడా దారుణానికి పాల్పడ్డారు. ఎనిమిది అంగుళాల సిలిండర్‌ను మహిళ శరీరంలోకి చొప్పించడంతో ఆ మహిళ చిత్రహింసలకు గురైంది. ఆ మహిళ నొప్పితో అరుస్తూనే ఉండటంతో.. శబ్దం విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత.. రక్తస్రావం అయిన మహిళను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు అన్నదమ్ములిద్దరినీ అరెస్ట్ చేశారు.
Read Also: Bengaluru video: ఈ కానిస్టేబుల్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే.. ప్రాణాలకు తెగించి డేరింగ్ అరెస్ట్
మరోవైపు.. ఇటావాలోని షేక్‌పూర్ తలైయాకు చెందిన 30 ఏళ్ల రేష్మ అనే మహిళకు ఫిరోజాబాద్ జిల్లా మత్సేనా అకల్‌పూర్‌లో నివాసం ఉంటున్న సుర్జీత్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. మహిళకు ముగ్గురు పిల్లలు. పెళ్లి అయినప్పటి నుంచి అత్తమామలు తనను వేధిస్తున్నారని మహిళ సోదరుడు అవధేష్ పోలీసులకు తెలిపాడు. చిన్న చిన్న విషయాలకే తన సోదరిని కొట్టేవారని.. సోమవారం రాత్రి ఆమె చేతులు, కాళ్లు కట్టేసి అన్నదమ్ములు ముగ్గురూ కలిసి తన చెల్లెలిని కొట్టి చంపారని మృతురాలి సోదరుడు తెలిపాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!