Yogi Adityanath: హోలీ పండగ వేళ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మాట్లాడుతూ.. సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచంలో మరే దేశానికి లేదా మరే మతానికి ‘‘సనాతన ధర్మం’’ వంటి గొప్ప పండగలు, వేడుకల సంప్రదాయం లేదని ఆయన అన్నారు. గోవధదారులకు మద్దతు ఇచ్చిన వారు, అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన వారు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Ranya Rao : నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్.. రోజుకో కొత్త ట్విస్ట్!
‘‘”మమ్మల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఎవరు?” అని యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జరిగిన సాంప్రదాయ ‘నర్సింగ్ శోభాయాత్ర’ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘వారు శ్రీరాముడిని, అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన వారే’’ అని అన్నారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ.. ‘‘వీరే గోవుల అక్రమ రవాణాలో పాల్గొంటారు, గోవధ చేసేవారికి ఆశ్రయం కల్పిస్తారు. వారిని అధికారంలో భాగస్వాములను చేస్తారు. భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా మారదని చెప్పుకునేవారు కూడా వీరే’’ అన్నారు.
‘‘రాముడు మనకు మర్యాదగా, గౌరవ మార్గంలో నడవాలని నేర్పించాడు. మనం గౌరవంగా ముందుకు సాగినప్పుడు, మన పవిత్రతను ముందుకు తీసుకెళ్తాం. మేము లక్ష్మణ రేఖను ఎప్పుడూ ఉల్లంఘించము’’ అని అన్నారు. ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహాకుంభమేళ వేళ సనాతన ధర్మం, భారతదేశం రెండింటి సామర్థ్యాలను చూసినప్పుడు సనాతన వ్యతిరేకులకు తగిన సమాధానం లభించిందని అన్నారు. త్రివేణి సంగమం వద్ద 66 కోట్ల మంది భక్తులు కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సీఎం అన్నారు.