Allahabad HC: లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ(పోక్సో) కేసును విచారిస్తున్న సందర్భంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా తాడు తెంచడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదని చెప్పింది. కానీ, ఇది తీవ్రమైన లైంగిక దాడిగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది. కాస్గంజ్ లోని ప్రత్యేక న్యాయమూర్తి పోక్సో కోర్టు సమన్ల ఉత్తర్వులను జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రాతో కూడిని సింగిల్ బెంచ్ సవరించి, కొత్త సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. అత్యాచారం అభియోగంపై జారీ చేసిన సమన్లు చట్టబద్ధం కాదని కోర్టు పేర్కొంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని కాస్గంజ్ లో 11 ఏళ్ల మైనర్ బాలిక రొమ్ములను పట్టుకుని, ఆమె పైజామా తాడును తెంచి, కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించారని నిందితులు పవన్, ఆకాష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, అదే దారి గుండా వెళ్తున్న మరో వ్యక్తి ఆమెను రక్షించడంతో బాధితురాలు అక్కడి నుంచి సురక్షితంగా బయటపడింది. దీనిపై పాటియాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
Read Also: Yogi Adiyanath: ఆక్రమణదారుల్ని కీర్తించడం దేశద్రోహమే.. ఔరంగజేబు వివాదంపై యోగి వార్నింగ్..
నిందితులు పవన్, అకాశ్, అశోక్‌లపై మొదట ఐపీసీ సెక్షన్ 376 మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ 18 కింద అభియోగాలు నమోదయ్యాయి. నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపు) కింద, ఐపీసీ సెక్షన్ 354-బి (వివస్త్రాలను తొలగించే ఉద్దేశ్యంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం) కింద కూడా విచారించాలని హైకోర్టు ఆదేశించింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ని పాక్షికంగా అనుమతించిన హైకోర్టు..‘‘నిందితులైన పవన, ఆకాష్‌పై మోపబడిన ఆరోపణలు, కేసు వాస్తవాలు ఈ కేసులో అత్యాచార ప్రయత్నం నేరంగా పరిగణించబడవు’’ అని పేర్కొంది.
ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితులు పవన్, ఆకాష్ 11 ఏళ్ల బాధితురాలి రొమ్ములను పట్టుకున్నారు, ఆకాష్ ఆమె పైజామా దారాన్ని విరిచి ఆమెను కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించాడు, కానీ బాటసారులు/సాక్షులు జోక్యం చేసుకోవడంతో నిందితులు బాధితురాలని అక్కడే వదిలి పారిపోయారు. వారు అత్యాచారం చేయలేదు అని పేర్కొన్నారు.