UP: సంభాల్‌లో 46 ఏళ్ల తర్వాత హోలీ.. మసీదు ముందు నుంచి డీజే ఊరేగింపు(వీడియో)
- దేశమంతటా ఘనంగా హోలీ
- యూపీలోని సంభాల్‌లో 46ఏళ్ల తర్వాత పండుగ
- ఘనంగా నిర్వహించుకున్న హిందువులు
- భారీగా పోలీసు బందోబస్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్‌లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు. హోలీ ఊరేగింపు సంభాల్‌లోని ఒక మసీదు ముందు నుంచి సాగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
READ MORE: Minister Nimmala Ramanaidu: జూన్ నాటికల్లా లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు..
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
వాస్తవానికి.. భస్మ శంకర్ ఆలయం అని కూడా పిలువబడే కార్తీక్ మహాదేవ్ దేవాలయం 1978లో మూసేశారు. మత అల్లర్లు నగరాన్ని కుదిపివేసిన తరువాత.. ఆలయం మూతపడింది. ఈ ఆయంలో46 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 13, 2024న తిరిగి తెరిచారు. ఈ దేవాలయానికి విముక్తి కలిగిన తర్వాత వచ్చిన మొదటి హోలీ ఇది. అందుకే భక్తులు, హిందువులు పెద్ద ఎత్తున డీజే చప్పుళ్లతో నగర పుర వీధులు గుండా డ్యాన్స్‌లు చేస్తే ఘనంగా హోలీ నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
READ MORE: CM Yogi: హోలీ సందర్భంగా హిందువులకు సీఎం యోగి కీలక సందేశం!
ఇటీవల సంభాల్ పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ‘‘హోలీ ఏడాదికి ఒకసారి వస్తుంది. శుక్రవారం నమాజ్ 52 సార్లు చేసుకోవచ్చు. ఎవరికైనా హోలీతో ఇబ్బంది ఉంటే ఇంట్లోనే ఉండండి.’’ అని సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ చౌదరి అన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సంభాల్‌లోని వివాదాస్పద జామా మసీదుతో పాటు మరో 10 మసీదులను టార్పలిన్లతో కప్పారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య రెండు మతాల పండుగలు సామరస్యంగా జరుపుకుంటున్నారు.
#WATCH | #Holi procession underway in Uttar Pradesh's Sambhal as the festival of colour is being celebrated today across India with great enthusiasm pic.twitter.com/eYwETKL8om
— ANI (@ANI) March 14, 2025
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!