దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటిపోయింది. పెట్రోల్ధరలకు భయపడి వాహనాలను బయటకు తేవడంలేదు. కొంతమంది పబ్లిక్ వాహనాలను వినియోగిస్తుంటే, మరికొందరు సంప్రదాయ వాహనాలను వినియోగిస్తున్నారు. గతంలో ఎలాగైతే రవాణాకోసం ఎడ్ల బండ్లను వినియోగించేవారో, ఇప్పుడు కొన్ని చోట్ల వాటిని తిరిగి వినియోగించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు పెళ్లిళ్లకు ఇలాంటి ఎడ్లబండిమీదనే వెళ్లేవారు. పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో మరలా ఎడ్లబండివైపు చూస్తున్నారు. Read: ‘తలైవి’కి తమిళంలో…
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తూనే.. కేబినెట్లో మార్పులు చేర్పులపై కూడా మంతనాలు జరిగినట్టుగా తెలుస్తోంది.. రెండు రోజుల పర్యటన కోసం.. నిన్న ఢిల్లీ చేరుకున్న యోగి.. ప్రధాని మోడీతో సమావేశం తర్వాత.. బీజేపీ…
ఇటీవల అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోనూ అస్సాం నిలబెట్టుకోవడం తప్ప మరెక్కడా గెలవలేకపోవడం, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌పై ఎంతగా కేంద్రీకరించినా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం బిజెపి దూకుడుకు పగ్గాలు వేసింది. ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరించడం, వాక్సిన్ సరఫరాలో తీవ్ర కొరత కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి కారణమైనాయి. మోడీ పాలన ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్న బిజెపి ఆలోచనలు అమలు కాకపోగా…
మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి.. కానీ, డబ్బుల కోసం ఆశపడి తన కోడలినే అమ్మేశాడు… తన కుమారుడి భార్యను రూ.80 వేలకు ఓ ముఠాకు అమ్మేందుకు సిద్ధపడి డీల్ కుదుర్చుకున్నాడు.. అయితే, ఈ విషయం కుమారుడికి తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు.. దీంతో, దాని వెనుక ఉన్న ఓ ముఠా గుట్టురట్టుఅయ్యింది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారబంకీ జిల్లా మల్లాపుర్ లో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన కోడలిని గుజరాత్‌కు…
దేశంలో కరోనా కేసులు మెల్లిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా జరుగుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే అస్త్రం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్ ఇటావా జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపించిన వాళ్లకే మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీచేసింది. మద్యం దుకాణాల వద్ద ప్రత్యేక నోటీసు బోర్డులు అంటించేలా చర్యలు చేపట్టింది. కరోనా టీకా వేయించుకున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని చూపించిన తర్వాతే అమ్ముతున్నామన్నారు.
సరిగ్గా తాళి కట్టాల్సిన సమయంలో పెళ్లిపీఠల పై నుంచి పరారయ్యాడు ఓ యువకుడు.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెద్దలకు చెప్పలేక.. తాళి కట్టే వరకు తెచ్చుకున్న అతగాడు.. చివరి సమయంలో వెళ్లిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా మహరాజ్‌పూర్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోవిడ్ నిబంధనల మధ్య గ్రాండ్‌కు పెళ్లి ఏర్పాట్లు చేశారు పెద్దలు.. అంతా హడావుడి.. వధూవరుల తరఫు బంధువులు వచ్చేశారు.. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు…
ఉత్తర ప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కరోనా సోకుతున్నది. తాజాగా కరోనాతో యూపీ మంత్రి విజయ్ కశ్యప్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ముజఫర్ జిల్లాలోని చార్తవాల్…
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం.. వందలాది మృతదేహాలు గంగా నదిలో తేలడం తీవ్ర కలకలమే సృష్టించింది.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ…
విద్యుత్ సరఫరాలో అంతరాయం కరోనా రోగుల ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో కలకలం సృష్టిస్తోంది.. మహమ్మారి కట్టడి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను పూనుకుంటోంది.. బెడ్ల కొరత, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. అయినా.. క్రమంగా అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మృతుల సంఖ్య కూడా కలవరపెడుతోంది.. తాజాగా, గోరఖ్‌పూర్‌లోని ఆరుహి ఆస్పత్రి అండ్ ట్రామా సెంటర్లో చికిత్స సమయంలో వెంటిలేటర్‌పై ఇద్దరు కోవిడ్ రోగులు మృతిచెందారు.. ఈ ఘటనను సీరియస్‌గా…
రెండో ఎక్కం ఓ వరుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. రెండో ఎక్కం చెప్పడం రాలేదని చెప్పి వధువు పెళ్లి క్యాన్సిన్ చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాకు చెందిన రంజిత్ మహిల్వార్ అనే వ్యక్తికీ వివాహం నిశ్చయమైంది. వివాహం రోజున వరుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు ఆ వ్యక్తిని రెండో ఎక్కం చెప్పమని కోరారు. అయితే, వరుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. …