ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) కన్నుమూశారు.. లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ లోని ఐసియూలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.. ఇక, ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. కళ్యాణ్‌సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి లక్నో వెళ్లిన ఆయన.. నేరుగా కల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహం దగ్గర పూలను ఉంచి నమస్కరించి.. నివాళులర్పించారు.. ఇక, కల్యాణ్ సింగ్ జన సంక్షేమాన్నే తన జీవిత మంత్రంగా చేసుకున్నారి.. యూపీతోపాటు దేశ అభివృద్ధికి పాటుపడ్డారని.. నిజాయితీ, మంచి పాలనతో పేరు సంపాదించారంటూ.. ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ వెంట.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తదితరులు ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన దశలో సీఎంగా పనిచేశారు కల్యాణ్ సింగ్.. యూపీకి రెండుసార్లు సీఎంగా సేవలు అందించారాయన.. ముందుగా 1991 జూన్ నుంచి 1992 వరకూ, ఆ తర్వాత 1997 సెప్టెంబర్ నుంచి నవంబర్ 99 వరకూ సీఎంగా పనిచేశారు. 1992లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన చోటు చేసుకుంది.