ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (89) మృతి చెందారు. లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితమే మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్యాణ్ సింగ్… పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కళ్యాణ్ సింగ్ రెండు సార్లు సీఎం గా పనిచేశారు. అలాగే రాజస్థాన్ మరియు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్గా కూడా కళ్యాణ్ సింగ్ పనిచేశారు. కాగా కళ్యాణ్ సింగ్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
బుచ్చయ్య రాజీనామాపై వైసీపీ ఎంపీ కామెంట్ !
ఇక ఇటు కళ్యాణ్ సింగ్ మరణంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘కళ్యాణ్ సింగ్ గారు బీజేపీలో క్రమశిక్షణ కలిగిన సీనియర్ నాయకులు. పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. బతికినన్నాళ్లు అయోధ్యలో శ్రీ రాముడి భవ్య రామాలయం గురించి తపించారు. యూపీకి 2 సార్లు ముఖ్యమంత్రిగా, రాజస్తాన్ గవర్నర్ గా సేవలందించారు. ఆయన మరణం దేశానికి, బీజేపీ పార్టీకి తీరని లోటు. కళ్యాణ్ సింగ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.’’అని శ్రీ బండి సంజయ్ పేర్కొన్నారు.