మాజీ మంత్రి అనుమానాస్పదంగా మృతిచెందడం యూపీలో కలకలం రేపుతోంది.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఆత్మారామ్ తోమర్ తన ఇంట్లో మృతిచెందారు.. బెడ్రూంలో మంచంపై విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించిన ఆయన డ్రైవర్.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.. అయితే, ఆత్మారామ్ తోమర్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత హత్య కేసుగా మార్చాల్సి వచ్చింది.. సీనియర్ బీజేపీ నేత ఆత్మరామ్ తోమర్ హత్యపై…
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు.. మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు.. గురువారం కాట్ర చందనలో జరిగిన సభలో.. మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా ఉపన్యాసం చేయడం, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి…
వచ్చే ఏడాది కాలంలో దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిపై ఏబీపీ సీ వోటర్ ఇటీవల ఓ సర్వే చేసింది. దాని ప్రకారం యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో కమళదళం వికసిస్తుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కి షాక్ తప్పదని తెలుస్తోంది. అయితే అక్కడ కాంగ్రెస్‌కు ఈ దుస్థితి ఎందుకు దాపురించింది? ఈ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధమే. దానికి పూర్తి బాధ్యత రాహుల్, ప్రియాంకలదే. సిధ్దూని పీసీసీ చీఫ్‌గా ప్రమోట్ చేయటం వల్ల ఇంటిపోరు పెరిగిందే…
2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే కీలక రాజకీయ మార్పులు జరిగాయి… ఇప్పుడు.. ఆ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు కాగా.. మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చగా మారింది.. బేబీ రాణి మౌర్య.. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపినట్టు రాజ్‌భవన్ అధికారి తెలిపారు.. అయితే, ఆమె వ్యక్తిగత కారణాలతోనే…
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల టైం సమీపిస్తున్న కొద్ది అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికంగా ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో ఈజీగా వరుసగా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ సర్కారును దెబ్బకొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.…
ఉత్తరప్రదేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుపత్రిని నిర్మించారు. అందులో రోగుల కోసం లిప్ట్ను ఏర్పాటు చేశారు. అయితే, 1997 వరకు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కారణాల వలన వినియోగించకుండా వదిలేశారు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవలే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా అందులో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. లిఫ్ట్‌లో ఓ మనిషికి సంబందించిన అస్తిపంజరం కనిపిచింది. దానిని చూసిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.…
సాధారణంగా దొంగలు దొంగతనం చేసే సమయంలో ఎవరైనా అడ్డువస్తే వాళ్లను చంపడానికైనా వెనుకాడరు. బెదిరించి దొంగతనం చేస్తారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోయే ముందు వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తారు. కానీ, ఈ దొంగలు మాత్రం దానికి విరుద్దంగా చేశారు. బెదిరించి దొచుకున్న డబ్బు, బంగారంతో తిరిగి వెళ్తూ ఆ ఇంటి యజమాని కాళ్లకు మొక్కారట. అంతేకాదు, తీసుకున్న డబ్బులను ఆరునెలల లోగా తిరిగి ఇస్తామని చెప్పి వెళ్లారట. వెళ్తూ వెళ్తూ రూ.500 ఆ ఇంటి యజమానికి ఇచ్చి…
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) కన్నుమూశారు.. లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ లోని ఐసియూలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.. ఇక, ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. కళ్యాణ్‌సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి లక్నో వెళ్లిన ఆయన.. నేరుగా కల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహం దగ్గర పూలను ఉంచి నమస్కరించి.. నివాళులర్పించారు.. ఇక, కల్యాణ్ సింగ్…
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ (89) మృతి చెందారు. లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితమే మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్యాణ్ సింగ్… పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కళ్యాణ్ సింగ్ రెండు సార్లు సీఎం గా పనిచేశారు. అలాగే రాజస్థాన్ మరియు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా కళ్యాణ్ సింగ్ పనిచేశారు. కాగా కళ్యాణ్ సింగ్ మృతి పట్ల పలువురు…
రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా యూపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని UPSRTC పేర్కొంది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని…