ఉత్తరప్రదేశ్‌లో 1991లో ఈపీసీఈ అనే ఆసుపత్రిని నిర్మించారు. అందులో రోగుల కోసం లిప్ట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, 1997 వరకు వినియోగించిన లిఫ్ట్‌ను కొన్ని కారణాల వలన వినియోగించకుండా వదిలేశారు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే, తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇటీవలే అధికారులు ఈ లిఫ్ట్‌ను ఓపెన్ చేయగా అందులో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. లిఫ్ట్‌లో ఓ మనిషికి సంబందించిన అస్తిపంజరం కనిపిచింది. దానిని చూసిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. లిప్ట్ ఆగిపోయిన సమయంలో ఆ లిఫ్ట్‌లో ఎవరైనా ఉన్నారా లేదంటే, ఎవరైనా హత్యచేసి డెడ్‌బాడీని అందులోపడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.