దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. అనేక విశ్వ విద్యాలయాల పరీక్షలు కూడా ప్రారంభం అయ్యాయి. చాలా కాలం తరువాత తిరిగి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలు బడికి పంపుతుండటంతో ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్‌ను అందించారు. మిగిలిన కొంతమందికి కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక…
పాకిస్తాన్లో మతమార్పిడులు సహజం. అక్కడ ఇతర మతస్థులను ఇస్లామ్ మతంలోకి బలవంతంగా మారుస్తుంటారు. అయితే, హిందువులు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా మతమార్పిడిలు జరుగుతున్నాయి. దీనికోసం ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి జాబితాలో మీరట్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ పేరు మతం మార్పిడి చేసుకుంటున్న వారి లిస్ట్‌లోకి వెళ్లడంతో ఏటీఎస్ పోలీసులు అతడిని విచారణ జరిపారు. ఎటీఎస్…
భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. వింతలూ, విశేషాలు కామన్. అయితే, కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి వింతైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదానది ఉన్నట్టుండి గుడ్లనదిలా మారిపోయింది. వేలాది గుడ్లు నదిలో తేలాడుతూ కనిపించాయి. దీంతో హరియావా గ్రామస్తులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా నదిలో…
తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు వర్షాలు దంచికొట్టాయి.. మరికొన్ని రాష్ట్రాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.. ఈ తరుణంలో.. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయంటూ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ).. ఈ రోజు, రేపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రానున్న మూడు…
అక్కడికక్కడే 18 మంది మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో లక్నో – అయోధ్య హైవేపై మంగళవారం అర్ధరాత్రి డబుల్ డెక్కర్, బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో.. స్పాట్లోనే 18 మంది మృతిచెందగా.. మరో 15 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.. పంజాబ్‌లోని లూధియానా నుంచి ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బీహార్ వెళ్తుంది.. అయితే.. బారాబంకి రామ్‌స్నెహిఘాట్ కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారిపై బస్సు నిలపివేశారు..…
ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఇప్పుడు ఊహించడం కష్టమే. చదువున్నా లేకపోయినా ఇంటర్నెట్ మాత్రం కావాలి. లేదంటే ప్రపంచం ముందుకు కదలని పరిస్థితి. ఒకప్పుడు ఇంటర్నెట్ అత్యంత ఖరీదైన వ్యవహారం. కానీ, ఇప్పుడు అదే ఇంటర్నెట్ అత్యంత చౌకగా దొరుకుతున్నది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఫ్రీ వైఫై అందిస్తున్నాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో ఫ్రీ వైఫై అందిస్తుంటారు. కేవలం రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లోనే కాకుండా, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా వైఫై అందించేందుకు యూపీ సర్కార్…
దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిన కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు ఉత్తరాదిన వర్షాలు దుమ్మురేపుతున్నాయి. యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడ్డాయి. Read: బ్రేకప్ తర్వాత బీచ్ లో మెహ్రీన్.. కొత్త ఉత్సాహం యూపీలో భారీ వర్షంతో పాటుగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడటంతో 18 మంది మృతి…
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది మునిగిపోయారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. గుప్తార్ ఘాట్‌లో వద్ద స్నానాలు వెళ్లిన సమయంలో… వారంతా నీట మునిగిపోయారు. ఇంకా ఆరుగురి జాడ తెలియలేదు. గజ ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఏడేళ్ల బాలిక నీటిలో ఈదుకుంటూ వచ్చి ప్రాణాలను కాపాడుకుంది. రక్షించిన వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితులంతా ఆగ్రాలోని…
వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ, యూపీలో ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నది. యోగి సర్కార్ వైఫల్యాలు, కరోనా సమయంలో సర్కార్ చేసిన తప్పులు, ప్రజలు పడిన ఇబ్బందులు అన్నింటిని ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని చూస్తున్నది. యూపీ కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ యాక్టీవ్ గా ఉండటంతో ఆమెపై రాష్ట్రనాయకత్వం బోలెడన్ని ఆశలు పెట్టుకున్నది.…
వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.. కానీ, ఇప్పుడు విమర్శలు, ఆరోపణలు కాకరేపుతున్నాయి.. తాజాగా.. కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాది పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా.. ఇస్లామిక్ ఉగ్రవాదులతో స్నేహం నెరుపుతాయని కాంగ్రెస్, ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన ఆయన.. పేదలకు డబ్బు ఆశ చూపి మదర్సాలు మత మార్పిళ్లకు పాల్పడుతున్నాయని ఫైర్ అయ్యారు.. ముస్లిం దేశాల నుంచి నేరుగా మతం మారిన పేదల ఖాతాల్లో నగదు జమ…