దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. అనేక విశ్వ విద్యాలయాల పరీక్షలు కూడా ప్రారంభం అయ్యాయి. చాలా కాలం తరువాత తిరిగి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలు బడికి పంపుతుండటంతో ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్‌ను అందించారు. మిగిలిన కొంతమందికి కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పాఠశాలలకు హాజరవుతున్న విద్యార్ధులకు వినూత్నంగా స్వాగతం పలికారు. పూలు జల్లి, చాక్లెట్ అందిస్తూ విద్యార్థులకు స్వాగతం పలికారు. ప్రతిరోజూ తప్పనిసరిగా థర్మల్ స్కానింగ్ చేయాలని, శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Read: బీటెక్ విద్యార్ధి రమ్య హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు !