ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో బుధవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. చాక్లెట్లు తిని నలుగురు చిన్నారులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కాశ్య ప్రాంతంలోని దిలీప్ నగర్లో ఉన్న ఓ ఇంటి ముందు ప్లాస్టిక్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో ఐదు చాక్లెట్లు, కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఆ చాక్లెట్లను ఆమె తన ముగ్గురు మనవళ్లకు, పక్కింట్లో నివసిస్తున్న మరో చిన్నారికి ఇచ్చింది. ఆ చాక్లెట్లు తిన్న కాసేపటికే పిల్లలు…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం తొందరపడటం లేదు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. గోవాలో ఒక్క సీటు తక్కువైనా.. మద్దతు ఇచ్చేందుకు స్వతంత్రులు, ఎంజీపీ రెడీగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్యలు లేకపోయినా.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మాత్రం.. చాలా కసరత్తే చేస్తున్నారు. గతంలో కేంద్ర కేబినెట్ కోసం ఎంత వర్కవుట్ చేశారో..…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా…
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ వెల్లడించారు.. ఈ ఫలితాల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్‌షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది.. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఇక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి..…
అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే ఈ ఫలితాలు ఉన్నాయి. అయితే పంజాబ్ లో ఆప్ ఊహించని మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ దాదాపు తుడిచి పెట్టుకుపోవటం ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన విశేషం. ఇప్పటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక దేశ వ్యాప్త విస్తరణకు ప్రయత్నిస్తుంది. ఈ విజయంతో ఆ పార్టీకి జాతీయ హోదా కూడా దక్కుతుంది. దేశంలో…
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో బీజేపీ తిరిగి విజయ పీఠాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ సాధించిన విజయంలో ఓ తెలుగు వ్యక్తి కృషి కూడా దాగి ఉంది. అతడే సత్యకుమార్. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి నేతగా మారి ప్రస్తుతం యూపీ బీజేపీ ఇంఛార్జిగా ఆయన సేవలందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి తనదైన ప్రచార వ్యూహ రచనతో యూపీలోని 403 స్థానాల్లో 135 స్థానాలకు సత్యకుమార్ చేసిన కృషి అనితర సాధ్యమని రాజకీయ విశ్లేషకులు…
యూపీలో కాంగ్రెస్ ఘోరంగా పతనమైందని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. 403 స్థానాలకు పోలింగ్ జరగగా 400 చోట్ల హస్తం తరఫున అభ్యర్థులు పోటీ చేశారు. అయితే కేవలం ఒక్క చోట మాత్రమే ఆధిక్యత కనబరుస్తున్నారు. నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ఉన్న ప్రియాంకా గాంధీ యూపీపై ప్రత్యేక దృష్టి పెట్టి తీవ్రంగా శ్రమించినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్న అమేథీ, రాయ్‌బరేలీలోనూ హస్తం నేతలకు ఓటమి తప్పలేదు. కాగా…
భారత రాజకీయాల్లో ఒక మాట చాలా ప్రసిద్ధి. అదేంటంటే ఢిల్లీ రహదారి లక్నో నుంచే వెళుతుంది అని. దాని ప్రకారం ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయని. ఇంకో మాటలో చెప్పాలంటే యూపీని గెలవకుండా ఢిల్లీని గెలవలేరని అర్థం. ప్రజాభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ. బీజేపీ జాతీయ ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని…
యూపీలో నాలుగో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి, గాంధీకుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. లఖీంపూర్ ఖేరీ ఘటన జరిగిన ప్రాంతంలో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. Read: Live: గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు…
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది.. ఇవాళ గోండా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తుండగా.. కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. వెంటనే ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. ఇక, యువత నిరసనపై స్పందించిన రాజ్‌నాథ్ సింద్.. న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చి శాంతింపజేశారు.. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోళీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్…