యూపీలో నాలుగో విడత ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి, గాంధీకుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. లఖీంపూర్ ఖేరీ ఘటన జరిగిన ప్రాంతంలో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి.
Read: Live: గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. గతేడాది అక్టోబర్ 3 వ తేదీన లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనతో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 59 నియోజక వర్గాల్లో 51 చోట్ల బీజేపీ విజయం సాధించింది. 4 చోట్ల ఎస్పీ, 3 చోట్ల బీఎస్పీ, ఒక చోట అప్నాదళ్ విజయం సాధించింది.