ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఇవాళ వెల్లడించారు.. ఈ ఫలితాల్లో ఎగ్జిట్పోల్స్ అంచనాలకు మించి నరేంద్ర మోడీ-అమిత్‌షా ద్వయం ప్రభంజనాన్ని సృష్టించింది.. పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించింది.. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఇక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మాత్రం ఎక్కడా పుంజుకున్నది లేదు.. పైగా తన ఓటమి పరంపరను కొనసాగించిందనే చెప్పాలి..
Read Also: AP: బందరులో దారుణం.. ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై..!
ఇక ఐదు రాష్ట్రాల్లో తుది ఫలిలితాలను ఓసారి పరిశీలిస్తే…
ఉత్తరప్రదేశ్ (403): బీజేపీ 273, ఎస్పీ 125, బీఎస్పీ 1, కాంగ్రెస్ 2, ఇతరులు 2
పంజాబ్ (117): ఆమ్‌ఆద్మీ పార్టీ 92, కాంగ్రెస్ 18, ఎస్‌ఏడీ 4, బీజేపీ 2, ఇతరులు 1
ఉత్తరాఖండ్ (70): బీజేపీ 47, కాంగ్రెస్ 19, ఇతరులు 4
మణిపూర్ (60): బీజేపీ 32, కాంగ్రెస్ 5, ఎన్‌సీపీ 7, ఇతరులు 16
గోవా (40): బీజేపీ 20, కాంగ్రెస్ 12, టీఎంసీ 2, ఇతరులు 6