AICC: కాంగ్రెస్ ప్రక్షాళన.. అధిష్టానం కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా చేయకుండా సోనియాను వారించిన నేతలు.. మీపై మాకు పూర్తివిశ్వాసం ఉందని ప్రకటించారు.. అయితే, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రక్షాళన ప్రారంభించింది.
Read also: Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ.. వెంటనే అమలు చేయండి..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
అందులో భాగంగా ఘోర ఓటమి పాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ… ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని పేర్కొన్నారు.. ఇక, మరిన్ని చర్యలకు కూడా సిద్ధం అవుతోంది కాంగ్రెస్ అధినాయకత్వం.. త్వరలో మరిన్ని చర్యలు, పూర్తి ప్రక్షాళన ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు.. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, గోవా పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్, మణిపూర్ పీసీసీ చీఫ్ నమీరక్పామ్ లోకేన్ సింగ్, ఉత్తరాఖండ్ నుండి గణేష్ గోడియాల్, ఉత్తరప్రదేశ్ నుండి అజయ్ కుమార్ లల్లూ రాజీనామా చేయాలని జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఇప్పటికే వరుస ఓటములు.. మరోవైపు జీ23తో సవాళ్లను ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రక్షాళన ప్రారంభించింది.. మరి, ఇది పార్టీకి కలిసివస్తుందా? లేదా? నెగిటివ్ ఫలితాలను చూపిస్తుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిన అంశం.
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!