ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం, పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతారణాన్ని కల్పించేందుకు యోగీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో నైట్ షిఫ్ట్ లో మహిళలు ఎవరూ పని చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా కార్మికులను పని చేయించుకోవద్దని ఆదేశించింది. మహిళల సొంత అనుమతితోనే పని చేసేలా ప్రభుత్వ సర్క్యులర్ ని జారీ చేసింది.
మహిళా కార్మికురాలు ఉదయం 6 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత పని చేయడానికి నిరాకరిస్తే, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించరు. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల సంఘటనలనను నివారించడానికి మహిళా కార్మికులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించే బాధ్యత యజమానిపై ఉంటుంది. ఒక వేళ పనిచేయాల్సి వస్తే సంబంధింత కంపెనీయే ఉచితంగా రవాణా, ఆహారం, భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది యూపీ సర్కార్. ఈ జీవో అనుగుణంగా కంపెనీల్లో ఫిర్యాదుల విభాగాన్ని పెట్టడం తప్పనిసరి చేసింది. వర్క్ ప్లేస్ లో మహిళలపై లైంగిక వేధింపులు చట్టం,2013 లోని నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులు తీసుకువచ్చింది.
ఇటీవల సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. పబ్లిక్ ప్లేసుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించారు. గుడులు, మసీదులు, పాఠశాలల్లోని లౌడ్ స్పీకర్లను స్వచ్ఛందగా తొలగించుకున్నాయి. ఇక మదర్సాలలో జాతీయ గీతాన్ని తప్పని సరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మదర్సాల్లో తరగతులు ప్రారంభం అయ్యే ముందు విద్యార్థులు, ఉపాధ్యాయులంతా జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాలని ఆదేశాలు ఇచ్చింది బీజేపీ సర్కార్.