UP: డీజీపీపై వేటు వేసిన సీఎం యోగి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేశారు.. ఇక, ఈ మధ్యే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో మరోసారి సీఎం అయ్యారు.. అయితే, యూపీ డీజీపీ ముకుల్ గోయల్‌పై వేటు వేశారు సీఎం యోగి.. ముకుల్ గోయల్‌ను విధుల నుంచి అర్ధాంతరంగా తప్పిస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు.. తమ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలోనే యోగీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది..
Read Also: CBI Raids: స్వచ్ఛంద సంస్థలే టార్గెట్.. 40 చోట్ల సీబీఐ దాడులు..
Also Read
11 నెలలకు పైగా రాష్ట్ర డీజీపీగా ఉన్న గోయెల్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా నియమితులయ్యారు. అతనికి ఇంకా దాదాపు రెండేళ్ల సర్వీస్ ఉంది మరియు 2024 ఫిబ్రవరి చివరిలో పదవీ విరమణ చేయనున్నారు. కానీ, మధ్యలోనే ఆయనను తప్పించారు సీఎం యోగి.. హోం శాఖ అధికారుల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం, శాఖాపరమైన పనులపై ఆసక్తి చూపడం లేదంటూ ఆరోపణలు ఉన్నాయి.. ఇక,
డీజీపీని తప్పించడంతో.. అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ), లా అండ్ ఆర్డర్, ప్రశాంత్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. 1987 ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ముకుల్ గోయల్.. గతంలో పలు కీలక పదవులు చేపట్టారు. గతంలో బీఎస్‌ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!