Kanhaiya Lal Gupta wins rail union election for 61st time at 106 age: రాజకీయాలైన, ట్రేడ్ యూనియన్లు అయిన ఇప్పుడున్న రాజకీయ పరిణామాల్లో ఒకటి, రెండు సార్లు గెలవడమే ఎక్కువ. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 61 సార్లు ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో గెలుపొందారు. ఏకంగా 106 ఏళ్ల వయస్సులో మరోసారి గెలిచి వయసు కేవలం నెంబర్ మాత్రమే అని.. శరీరానికి కానీ మనసుకు కానది నిరూపించారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆయన పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స, గిన్నిస్ బుక్ రికార్డుల్లో నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
వివరాల్లోకి వెళితే.. కన్హయ్య లాల్ గుప్తా, 106 ఏళ్ల వయసులో మరోసారి నార్త్ ఈస్టర్న్ రైల్వే మజ్దూర్ యూనియన్(ఎన్ఈఆర్ఎంయూ) ఎన్నికల్లో 61వ సారి ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికయ్యాడు. ఇప్పటికి కూడా కన్హయ్య లాల్ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తన వయసు పెద్ద సమస్య కాదని అంటున్నారు ఆయన. క్రమశిక్షణ, స్ఫూర్తి, నైతికబలం వంటి లక్షణాలను సామాజిక కార్యకర్త జయప్రకాష్ నారాయణతో తన అనుబంధం నుంచే ప్రేరణ పొందానని ఆయన అన్నారు.
Read Also: US Student Visas: అమెరికా స్టూడెంట్ వీసాల్లో ఇండియా రికార్డు.. ప్రపంచంలో మనమే ఫస్ట్
ఎన్ఈఆర్ఎంయూ సభ్యుల మధ్యలో ఉన్నప్పుడే తను శక్తి పొందుతానని.. నా ఏకైక కార్యాలయం, నా నివాసం, నా కుటుంబం అంతా ఈ ట్రేడ్ యూనియనే అని చెప్తున్నారు కన్హయ్య లాల్. మొదటి సారిగా 1946లో రైల్వేస్ లో చేరానని.. వెంటనే ట్రేడ్ యూనియన్ తో అనుబంధం పెంచుచున్నట్లు వెల్లడించారు. ప్రతీ ఏడాది ప్రధాన కార్యదర్శి ఎన్నికల్లో పాల్గొంటున్నారు కన్హయ్య లాల్. 1981లో పదవీ విరమణ చేసినప్పటికీ.. తన యూనియన్ తరుపున తన గళాన్ని వినిపించారు. తన కెరీర్లో నాలుగు సార్లు సర్వీస్ నుంచి తొలగించబడ్డారు. ఒక నెలపాలు జైలుకు కూడా వెళ్లివచ్చారు. అయినా కూడా ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలకు దూరం కాలేదు. అతనికి మంచి జ్ఞాపకశక్తి ఉందని.. తన దినచర్యను క్రమం తప్పకుండా పాటిస్తారని.. మసాలా లేకుండా రోజుకు పప్పుతో భోజనం చేస్తారని.. ఆరోగ్యం ఉంటారని ఎన్ఈఆర్ఎంయూ సభ్యులు చెబుతున్నారు.