Uttar Pradesh: వేరే మతం అమ్మాయితో ప్రేమ.. యువకుడి అనుమానాస్పద మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love affair with girl.. Suspicious death of a young man: వేరే మతానికి చెందిన అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. కట్ చేస్తే చెట్టుకు వేలాడుతూ కనిపించాడు యువకుడు. అయితే ఇది హత్యే అని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే తమ కొడుకును హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శనివారం బరేలీలో ఓ చెట్టుకు యువకుడి మృతదేహం వేలాడటం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
మృతుడు సునీల్ కుమార్, ముస్లిం మతానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే సునీల్ కుమార్ ను అమ్మాయి తరుపు బంధువులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చంపిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరిస్తున్నట్లు ఆరోపించారు. ముస్లిం వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తుండటంతో ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
Also Read
Read Also: CM Nitish Kumar: వచ్చే ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుంది.
అయితే ప్రేమికులు ఇద్దరు మరోసారి కలుసుకోరని.. ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత సునీల్ కుమార్ చనిపోయి కనిపించాడు. హత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సునీల్ కుమార్ తండ్రి.. అదే గ్రామానికి చెందిన ఫజల్, యాసిన్, అబ్రార్ అహ్మద్, సర్ఫరాజ్ అహ్మద్ పై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మృతుడు సునీల్ కుమార్, అతని ప్రేయసికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర చిత్రాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇది రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ కేసులో అనుమానితులను అదుపలోకి తీసుకున్నామని.. విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ రాజ్ కుమార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?