తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా హాట్ టాపిక్‌గానే కొనసాగుతోంది.. పూటకో మలుపు.. గంటకో ట్విస్ట్ అనే తరహాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. రాజీనామా చేసే పార్టీలోకి రావాలని బీజేపీ కండీషన్ పెడితే.. అసలు రాజగోపాల్‌రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు.. రాష్ట్ర నేతలతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగినా.. రాజగోపాల్‌రెడ్డి ఏ మాత్రం వెనక్కి తగ్గినట్టుగా కనిపించడంలేదు.. రాజగోపాల్‌రెడ్డితో వరుసగా సమావేశాలు నిర్వహించిన ఉత్తమ్ కుమార్…
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హతకు తగినది కాదని కేంద్రం స్పష్టం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్లు పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలలో భాగంగా వచ్చే జనవరిలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దయ్యే అవకాశం ఉందని PCC మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. శాసన సభ రద్దవ్వగానే మే నెలలోనే ఎలక్షన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో 50 వేల పైచిలుకు మెజారిటీతో తాను గెలవబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ పై ప్రజలు తిరగబడే రోజులు…