Bhatti Vikramarka: కోట్లు పోసి ఓట్లు కొంటున్నారు.. మిడతల్లా మునుగోడుపై పడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్. పార్టీల మధ్య ప్రచార జోరు రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ.. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీకీలక నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని బరిలో దింపిన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ మునుగోడు ప్రచారంలో భాగంగా.. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడులో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించామన్నారు.
మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ , బీజేపీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఊపయోగిస్తున్నాయని అన్నారు. అధికారంతో సంపాదించిన కోట్ల రూపాయలు ఓట్లను కొనడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం మంత్రి మల్లారెడ్డి 12 లక్షలు ఇస్తానని చెప్పి 2 లక్షలు.. ఇంకా 10 లక్షలు ఇవ్వకపోతే ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారని అన్నారు. బాధ్యత కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా స్వామ్యాన్ని కూని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకత్వం కేంద్రం నుండి మంత్రులు కోట్ల రూపాయలతో మునుగోడులో దిగుతున్నారని అన్నారు. మిడతాల లాగా మునుగోడుపై దాడి చేసి కోట్లు పోసి ఓట్లు కొంటున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు విలువకట్టలేని ఓటును ఇష్టా రాజ్యనా డబ్బులతో ఓట్లు కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి మీ ఓటు విలువకట్టలేనిదని అన్నారు. మునుగోడుని కొనుగోలు చేస్తామంటే మునుగోడు ప్రజలను అవమాన పరిచినట్టే అని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని కట్టడి చేయాలని, కొనుగోలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సిగ్గు, శరం వదిలి టీఆర్‌ఎస్, బీజేపీలు డబ్బు,లిక్కర్ తో ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలే వాళ్ళ మంత్రిని 12 లక్షలు ఇస్తానని 2 లక్షలు ఇచ్చి ఎలా వెళతారని అడ్డుకున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ము మునుగోడులో పెడుతున్నారని అన్నారు. మునుగోడు ఓటర్లు తెలివైన వారని, మునుగోడు ప్రజల్ని ఎవరు కొనలేరని అన్నారు. మిమ్మల్ని బయపెట్టాలని, బెదిరించాలని చూసిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి ఓటేసి గెలిపించాలని కోరారు.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు ధన, అధికార బలాన్ని వాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. లేకపోతే బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నుండి మంత్రులు, కేంద్రం నుండి మంత్రులు మునుగోడు గ్రామలని దత్తత తీసుకొని ఒక మహిళ గా నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మునుగోడు ప్రజలు ఇలా ధన బలం చూపెట్టే వారు రేపు ప్రజాసేవ చేయరు కాబట్టి తనకే ఓటు వేసి గెలిపించాలని పాల్వాయి స్రవంతి విజ్ఞప్తి చేశారు. వారి స్వలాభల కోసం తెచ్చిన ఎన్నిక అని తెలిపారు. ధన, అధికార బలం ఎంతున్న.. మునుగోడు ఓటరు మహాశయులు తనను ఆదరిస్తారని కోరుకుంటున్నాని పాల్వాయి స్రవంతి కోరారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!