Uttam Kumar Reddy: హుజూర్‌నగర్ నియోజవర్గంలో నేను 50 వేల మెజార్టీతో గెలుస్తా.. ఒక్క ఓటు తక్కువైనా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. హుజూర్‌నగర్ అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానానికి పోటీ చేశారు.. దాంతో, హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో.. ఆయన భార్యను బరిలోకి దింపినా.. విజయం సాధించలేకపోయారు.. అయితే, వచ్చే…
కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ నేతల నిరసనలు ఉద్రిక్తంగా మారింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈనేపథ్యంలో.. గాంధీభవన వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పీసీసీ హోదాలో వున్న రేవంత్ రెడ్డి ఇంటి పెద్దమనిషిగా వ్యవహరించాలని, 24 గంటలు సర్వీస్ ఇవ్వాల్సిందే అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నాకు అలవాటని, అసమ్మతి కాంగ్రెస్ లో సహజమని, అన్ని పార్టీలలో అసమ్మతి ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్కు ఆపార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. 8 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ము మునుగోడులో పెడుతున్నారని అన్నారు. మునుగోడు ఓటర్లు తెలివైన వారని, మునుగోడు ప్రజల్ని ఎవరు కొనలేరని అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి