T Congress Leader Uttam Kumar Reddy: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన పార్టీలో ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ గ్రామ గ్రామాన తిరుగుతూ ముందుకు సాగుతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతిని బరిలో దింపిన విషయం తెలిసిందే.. అయితే ఇవాళ మునుగోడు ప్రచారంలో భాగంగా.. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సిగ్గు, శరం వదిలి టీఆర్‌ఎస్, బీజేపీలు డబ్బు,లిక్కర్ తో ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలే వాళ్ళ మంత్రిని 12 లక్షలు ఇస్తానని 2 లక్షలు ఇచ్చి ఎలా వెళతారని అడ్డుకున్నారని ఎద్దేవ చేశారు. బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ము మునుగోడులో పెడుతున్నారని అన్నారు. మునుగోడు ఓటర్లు తెలివైన వారని, మునుగోడు ప్రజల్ని ఎవరు కొనలేరని అన్నారు. మిమ్మల్ని బయపెట్టాలని, బెదిరించాలని చూసిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి ఓటేసి గెలిపించాలని కోరారు.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు ధన, అధికార బలాన్ని వాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. లేకపోతే బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నుండి మంత్రులు, కేంద్రం నుండి మంత్రులు మునుగోడు గ్రామలని దత్తత తీసుకొని ఒక మహిళ గా నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మునుగోడు ప్రజలు ఇలా ధన బలం చూపెట్టే వారు రేపు ప్రజాసేవ చేయరు కాబట్టి తనకే ఓటు వేసి గెలిపించాలని పాల్వాయి స్రవంతి విజ్ఞప్తి చేశారు. వారి స్వలాభల కోసం తెచ్చిన ఎన్నిక అని తెలిపారు. ధన, అధికార బలం ఎంతున్న.. మునుగోడు ఓటరు మహాశయులు తనను ఆదరిస్తారని కోరుకుంటున్నాని పాల్వాయి స్రవంతి కోరారు.
సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడులో జరుగుతున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించామన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ , బీజేపీ రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలను విచ్చలవిడిగా ఊపయోగిస్తున్నాయని అన్నారు. అధికారంతో సంపాదించిన కోట్ల రూపాయలు ఓట్లను కొనడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం మంత్రి మల్లారెడ్డి 12 లక్షలు ఇస్తానని చెప్పి 2 లక్షలు.. ఇంకా 10 లక్షలు ఇవ్వకపోతే ఆ గ్రామ ప్రజలు అడ్డుకున్నారని అన్నారు.