jana reddy comments: కాంగ్రెస్ నేత జానా రెడ్డి మునుగోడులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు నేను ఎంతో శ్రమ పడ్డా, నన్ను ఇంకా ఆయాస పెట్టకండని, మీరు అలిసి మీ కాడి కింద పడేసినప్పుడు నేను వస్తా అన్నారు. నేను రాలేదని అనుకోకండని అన్నారు. నన్ను ఎక్కువ ఆయాస పెట్టకండని తెలిపారు. మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి జిల్లాకు సాగునీరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రూపుమాపడానికి కాంగ్రెస్ చేసిన కృషి అందరికి తెలుసని అన్నారు.
8 సంవత్సరాల కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్టును కూడా పూర్తీ చేయని, అసమర్ధ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వుందని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. నిజంగా అభివృద్ధి జరిగితే సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఎందుకు పూర్తీ కాలేదని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తీ కావాలంటే కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తీ చేయని, ఇచ్చిన హామీలను నెరవేర్చని టీఆర్ఎస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని అన్నారు.
ఇప్పటికీ తాను కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు తాను వెన్నెంటే ఉండటమే తన అభిమతం అన్నారు. మీకు నిజంగా ఆపద వచ్చినప్పుడు, మీరు కర్ర కింద వేసినప్పుడు.. తాను కర్ర పట్టుకొని నడవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కానీ.. ఇన్నాళ్లూ యుద్ధం చేసిన తనని, పదే పదే యుద్ధం చేయమని చెప్పడం తగునా? అని ఆయన ప్రశ్నించారు. మీరు ముందుకు సాగండి, అందుకు అవసరమైన అండదండలు అందిస్తామని, కార్యకర్తల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Naga Shaurya : ఆకట్టుకుంటున్న ‘కృష్ణ వ్రింద విహారి’ రొమాంటిక్ సాంగ్ మేకింగ్