టీపీసీసీ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల వివరాలు తమతో చర్చించకుండా కార్యచరణ రూపొందిస్తారని మండి పడ్డారు.
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గ్రామంలో ఎంపీటీసీ ఎర్రం శ్రీనివాస్‌రెడ్డిని ఎస్‌ఐ లోకేష్ అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డిపై దాడి చేసిన ఎస్‌ఐ లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ, ఎస్పీలను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీపై అర్హత వేటు సరికాదని గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని అన్నారు.
హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని అసెంబ్లీ మీడియా పాయింట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి రెడ్యానాయక్. డోర్నకల్ లో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడాడు అంటూ మండి మండిపడ్డారు.