Uttam Kumar Reddy: రేపిస్టులను విడుదల చేసి.. బీజేపీ తప్పుడు సంకేతాలిచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy Fires On BJP For Releasing Bilkis Bano Convicts: గుజరాత్‌లోని బిల్కిస్ బానో అత్యాచారం, హత్య కేసులో 11 మంది దోషులను విడుదల చేసి.. బీజేపీ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన సంకేతాన్ని ఇచ్చిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం కోదాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన ఆ 11 మంది నిందితులు, ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు ఏడుగురు సభ్యుల్ని హత్య చేసిన ఘటనలో దోషులు అని అన్నారు. గుజరాత్‌లోని దాహోద్ జిల్లా రంధిక్‌పూర్ గ్రామంలో ఆ ఘటన జరిగిందని.. దీనిపై బాధిత కుటుంబం సుధీర్ఘ పోరాటం చేసిన తర్వాత నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. కానీ.. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసులో శిక్షల్ని తేలిగ్గా తీసేసి, కోర్టులు & న్యాయ వ్యవస్థకు ప్రాముఖ్యత లేదని తప్పుడు సందేశాన్ని పంపిందని అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మహిళలకు గౌరవం, సాధికారతపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ వ్యవహారంపై మౌనం వీడాలని ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేదా? అనేది కేంద్రంతో చర్చించి స్పష్టం చేయాలన్నారు. అసలు ఈ కేసుని సిబిఐ దర్యాప్తు చేసిందా? అని ప్రశ్నించారు. ఈ పరిణామాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని.. దేశంలోని ఇతర ప్రభుత్వాలన్నీ తమ పార్టీలకు చెందిన రేపిస్టులను & హంతకులను విడుదల చేయడం ప్రారంభిస్తాయనన్నారు. సామాన్య ప్రజలకు ఉచితాలను వ్యతిరేకించే ప్రధాని మోదీ.. ఇప్పుడు బీజేపీలో చేరితే, రేపిస్టులు & హంతకులకు స్వేచ్ఛను వాగ్దానం చేయవచ్చని అన్నారు. నేర నేపథ్యం ఉన్న సభ్యులు, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని చెప్పారు.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
2002 అల్లర్ల ప్రస్తావన లేకుండా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరాడలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 11 మంది రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడం ద్వారా.. ఆ అల్లర్ల వెనుకకున్న వ్యక్తుల్ని బీజేపీ గుర్తు చేసిందని, ఆ అల్లర్లలో చనిపోయిన అమాయకుల శవాలపై రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నించడం నిజంగా సిగ్గు చేటని ఫైరయ్యారు. విడుదలైన రేపిస్టుల్లో అందరినీ లేదా కొందరిని అయినా.. రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా బీజేపీ నామినేట్ చేస్తుందన్నారు. ఆ 11 మంది రేపిస్టుల్ని విడుదల చేయడంపై సుప్రీంకోర్టు గానీ, ఏ హైకోర్టు గానీ పట్టించుకోకపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రేపిస్టులకు గుజరాత్ ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేసిందని, బీజేపీ సభ్యులుగా ఉంటే వారికి రక్షణ ఉంటుందని తప్పుడు సందేశం పంపిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!